మనిషి కాదు, మృగమే!

29 April, 2008

టైటిల్ చూసి ఇదేదో సినిమా గురించి అనుకునేరు, అలాంటిదేమీ కాదు ఈరోజు ఈనాడు పేపర్ లో "24 ఏళ్ళుగా కూతురిపై అత్యాచారం" వార్త ని చూడగానే ఒళ్ళంతా ఒకటే కంపరం, అసహ్యం కలిగాయి. ఇది నిజమా కాదా తెలుసుకుందామని గూగుల్ ఆశ్రయిస్తే, నిజమేనని తెలిసింది. అది ఇచ్చిన కొన్ని లింకులను క్రింద ఇచ్చాను చూడండి. ఆస్ట్రియా దేశంలో ఒక కామాంధుడైన తండ్రి తన 11 సంవత్సరాల కూతురు ని దాదాపు 24 సంవత్సరాలపాటు తన ఇంటి క్రింది రహస్య గదిలో ఉంచి అత్యాచారం చెయ్యడంతో పాటు, ఆమె ద్వారా ఏడుగురు సంతానాన్ని కన్నాడట ఆ ప్రబుద్ధుడు. 24 ఏళ్ళ పాటు ఒక ఇరుకు రహస్య గదిలో ఉండడమంటే మాటలా? ఎంతబాధ పడిందో పాపం. ఈ విషయంలో భారతీయులు ఏమీ తక్కువ తినలేదు లేండి ఎందుకంటే ఈ మధ్య మనదేశంలో కూడా ఇటువంటి సంఘటనలను జరుగుతున్నాయని ఆమధ్య పేపర్ లో చూశాను. ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మనం తిరిగి ఆటవిక యుగం వైపు వెళుతున్నామేమో అనిపిస్తుంది. ఈ విషయం గురించి మరిన్ని వివరాలకు నేటి (29/4/2008) ఈనాడు పేపర్ చూడండి. మరిన్ని లింకులు క్రింద ఇవ్వబడ్డాయి.

సందర్భం వచ్చింది కాబట్టి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. మంచైనా, చెడైనా చిన్నతనంలో నేర్చుకున్నది లేదా అనుభవించినది ఎప్పటికీ మర్చిపోలేము. అది చెడు అయితే జీవితమంతా నరకమే. "స్పర్శ" అనేది పెద్దలకీ పిల్లలకీ మధ్యన ఒక వారధిలా పనిచేస్తుంది, ప్రేమని పెంచుతుంది. మనం కరచాలనం చేసేది కూడా అందుకే. ప్రతిఒక్కరూ కూడా, వాళ్ళు తల్లితండ్రులైనా, బంధువులైనా, స్నేహితులైనా లేదా అపరిచితులైనా కూడా ఆ "స్పర్శ" ద్వారానే పిల్లలని ప్రేమిస్తారు. అయితే అది ఆత్మీయతని పంచే స్పర్శా లేక దురుద్దేశంతో కూడుకున్న స్పర్శ (చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ (C.S.A)) అనేది ఆ వయసు పిల్లలకి తెలిసే అవకాశంలేదు. తెలియచెప్పాల్సింది పెద్దలే ఎందుకంటే ఒక వయస్సువరకూ మన పిల్లల భవిష్యత్తు మనచేతుల్లోనే ఉంటుంది. C.S.A కి సంభందించిన మరిన్ని వివరాలకు సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనే ఈ లింక్ చూడండి.

పూర్తి టపా చదవండి!

ఏదినిజం? ఏదీ కాదు అంతా భ్రాంతి - అందుకు మనమే "సాక్షి"

26 April, 2008

ఈనాడు ని దెబ్బకొట్టడమే మా లక్ష్యం - అందుకు మీరే "సాక్షి": జగన్ తన పత్రిక ప్రకటనలలో ఈ విధంగా చెప్పినా లేదా ఆ పత్రిక కాప్షన్ గా "జగతి (పబ్లికేషన్స్) యే సత్యం" అని మార్చుకున్నా అది వాస్తవికతకి అద్దంపట్టినట్టు ఉండేది. సాక్షి మీద టపా వ్రాసి చాన్నాళ్ళయింది. వ్రాయడానికి టైమ్ లేకా కాదు, విషయం లేకా కాదు గానీ ఎందుకో కొన్నాళ్ళు ఆ విషయానికి దూరంగా వుందామని అనుకొన్నాను. నిన్న సాక్షి లో ఏదినిజం పేరిట "కధనం కోసం చంపేశారు" పేరిట వ్రాసిన వార్త ని చదివాను. సాక్షి లో పాతసంచికల లింకులో నిన్నటి పేపర్ ని మరోసారి చూద్దామంటే అది చూపించడంలేదు, పక్కనున్న బొమ్మ లో అది చూపిస్తున్న మెస్సేజ్ ని చూడండి. ఈ విషయం మీద పేపర్ క్లిప్పింగ్ విశాఖతీరాన వ్రాసిన బ్లాగ్ లోఉంది చూడండి. నిజంచెప్పద్దూ, ఆ వార్త ను చూసిన తరువాత నేను కూడా ఈనాడునే అనుమానించాను. Y.S.R ని ఇరుకున పెట్టడానికే ఈనాడు వాళ్ళు కొంచెం అతిగా వ్రాసారేమో అనుకున్నాను. కానీ ఈరోజు ఈనాడు దినపత్రిక లో "ఈ జీవచ్చవాలే సాక్షి", "బురద జల్లడమే నిజం" పేరుతో నిన్నటి సాక్షి వార్త కి ఇచ్చిన జవాబు బాగుంది, ఆంగ్లంలో అయితే "టిట్ ఫర్ టాట్" అంటారు. అంతే కాకుండా ఇదే విషయం మీద ఈ-టీవీ2 లో ప్రోగ్రామ్ కూడా ప్రసారం చేస్తున్నారట. పేపర్ లేటుగా చూడడం వలన ఆ ప్రోగ్రామ్ ని నేను చూడలేక పోయాను. ఈ టీ.వీ. ప్రోగ్రామ్ ని జగన్ ఎలా ఎదుర్కొంటాడో? ఇప్పటికే "సాక్షి" టి.వి. పెట్టే ఆలోచనలో ఉన్నాడేమో? ఇకనుండీ ఏదినిజం పేరుతో సాక్షిలో వస్తున్న వార్తలను ఖండించడానికి ఈనాడు లో కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారట. ప్రచారం చెయ్యగా చెయ్యగా అబద్ధం కూడా నిజం అవుతుందని ఈపని చేసిఉండవచ్చు గానీ చివరకి వాడు వ్రాసినదాన్ని ఖండించడానికి వీడు, వీడు వ్రాసిన దానిని ఖండించడానికి వాడు ప్రత్యేక ఎడిషన్ లే పెడతారేమో? జగన్ స్ట్రాటజీ చూస్తుంటే ఈనాడు మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నట్టుంది. ఇతను పేపర్ పెట్టడం ఏంటో గానీ రోజుకి రెండు మూడు పేపర్ లను చదివి విషయం తెలుసుకోవాలనే నాలాంటి వాళ్ళ కి ఈ వార్తలను చదివితే పిచ్చెక్కడం ఖాయం. చివరకి ఏదినిజం అంటే, ఏదీకాదు అంతా మన భ్రాంతి అని అంటామేమో!

పూర్తి టపా చదవండి!

సూర్య వెబ్ ఎడిషన్ కి ఇంకా సూర్యోదయం కాలేదు!

24 April, 2008

నేను ఇంతకుముందు సాక్షి గురించి వ్రాసిన టపా లో సూర్య పత్రిక కి కూడా త్వరలో వెబ్ ఎడిషన్ వస్తుందని కానీ వెబ్ చిరునామా ఇంకా తెలియదని వ్రాసాను. ఎందుకంటే అప్పుట్లో ఆ వెబ్ చిరునామా కి వెళితే కేవలం "పేజ్ అండర్ కన్స్ట్రక్షన్" అనే మెస్సేజ్ కనపడేది. ఇప్పుడు ఆ వెబ్ సైట్ ని సూర్య పేపర్ లోగో తో అప్ డేట్ చేసారు. దీనిని బట్టి సూర్య పేపర్ వెబ్ ఎడిషన్ లో కొంత కదలిక ఏర్పడింది అనుకోవచ్చా? దాదాపు రెండు నెలలక్రితం మొదటిసారి ఈ సైట్ ని చూసినప్పటికి, ఇప్పటికి ఆ లోగో తప్ప మరో మార్పు లేదు. నత్త నడక నడుస్తున్న ఈ పేపర్ యొక్క వెబ్ ఎడిషన్ కి "సూర్యో"దయం అయ్యేదెపుడో కదా!

పూర్తి టపా చదవండి!

లోక్ సత్తా: ఈ-మెయిల్ ప్రచారం

హై టెక్ ప్రచారం కేవలం భా.జ.పా కి మాత్రమే సొంతం కాదు తను కూడా చేయగలను అనుకుందో ఏమో లోక్ సత్తా కూడా ఇంటర్ నెట్ ప్రచారం చేసుకుంటున్నట్టుంది. మీ కెవరికైనా లోక్ సత్తా పార్టీ వాళ్ళ దగ్గర నుండి ఈ-మెయిల్ వచ్చిందా? ఈ రోజు నా యాహూ ఈ-మెయిల్ ని చూసినప్పుడు "Changing India’s political culture…" అనే హెడింగ్ తో జయ ప్రకాష్ నారాయణ గారి సంతకం తో ఒక ఈ-మెయిల్ కనపడింది. అది ఏప్రిల్ 18వ తారీఖున నా యాహూ మెయిల్ కి loksattapartyupdate AT gmail DOT com అనే అడ్రస్ దగ్గరినుండి వచ్చింది. ఇది అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కాదు బహుశా స్పామ్ మెయిల్స్ పంపించారని జనాలు తిడతారనేమో వేరే అడ్రస్ నుండి పంపించారు. ఈ ఈ-మెయిల్ లో సమకాలోన రాజకీయాల గురించి వివరించి, తాము పార్టీ ఎందుకు పెట్టవలసి వచ్చిందో వివరించారు. చివరగా కొత్త రాజకీయాల కోసం మన వంతుగా ఇవ్వగలిగే విరాళాల గురించి ప్రస్తావించారు ఈ-మెయిల్ యొక్క సోర్స్ కోడ్ చూడగా దీనిని http://www.ezlistmailer.com/ అనే వెబ్ సైట్ నుండి పంపించారని తెలుస్తుంది, ఈ సైట్ ద్వారా ఒకేసారి చాలా మందికి మెయిల్స్ (స్పామ్) పంపించవచ్చు. మొత్తం ఈ-మెయిల్ ని క్రింద అంటించాను చూడండి.


Dear Friend,
Regretfully in India, mainstream political parties in their unbridled lust for power are sacrificing the interests of the poor, imperatives of nation building, and sustained economic growth at the altar of short-term political and personal gains.

Traditional political parties refuse to empower the poor to help them climb out of poverty. Instead, they deliberately foster a master-servant relationship between rulers and the ruled, and rob people of their most treasured possession – dignity.
There are three burning issues on which national parties merely quibble to serve their party interests without taking a categorical stand in tune with national interests: reservations, national unity, and elimination of poverty.

On reservations for weaker sections in educational institutions and Government jobs, most political parties have not come up with any creative response although the issue is causing fissures in society. They have apparently forgotten that real empowerment comes only from provision of quality education at Government cost to all, and not through symbolic sops. The truly deserving poor should get bonus marks as weightage to give them a chance to compete with privileged children.

The response of most political parties to the growing tendency of extreme parochialism has been feeble. I refer your attention to the attacks on non-Marathis in Maharashtra (including the demand for reservation of 80-100% jobs in private sector only for Marathis), the battles between Kannadigas and Tamilians on sharing waters, and the continual ethnic cleansing in North Eastern India. Most political parties respond with the crassest opportunism, instead of condemning such tendencies, and taking a steadfast and consistent approach to strengthen national integrity and unity.

Rather than empowering our people, political parties indulge in competitive populism. The Union government wrote off Rs.60,000 crore loans of defaulting farmers without really strengthening agriculture. The country’s largest political party is promising color TV sets to people, if elected to power in Karnataka. In Andhra Pradesh, the two main political parties are going overboard in promising the moon. With such sops, the parties seek to make mendicants out of our people, and rob them of their self-respect.

Traditional political parties view people as mere voting machines in flesh and blood, instead of as living and breathing human beings.
Such exploitative and utterly corrupt politics must give way to a new political culture – one in which the citizen is supreme. Politics must once again be a noble endeavour
.

Lok Satta Party aims to usher in such a culture – one that is centred around the citizen, and provides dignity, opportunity, and justice for all.

You may be aware that the by-elections have been announced for 22 Assembly and Parliamentary Constituencies in AP for May 29th, 2008. These by-elections just a few months before the general elections will not in any way change the government, improve policies or the lives of the people. And yet they have been thrust on us because of brinkmanship of parties. They will cost about Rs.30 crore to the exchequer. We should convert these by-elections into an opportunity to create a platform for clean politics.

Lok Satta Party will, for the first time, compete in three Assembly constituencies in Hyderabad city: Khairtabad, Musheerabad, and Secunderabad. As usual, the other mainstream parties are expected to put up dynastic, and even criminal candidates, and employ money-muscle-liquor power to win these seats. An estimated Rs.500 crore will be spent by our opponents in these bi-elections in the state. If they win, tax payers like you and me can expect them to leach an estimated as Rs. 5000 crores from the public by giving government contracts to cronies, illegally appropriating government land (or conniving with officials to do so), transferring and posting officials for a price, interfering in crime investigation, and controlling state resources.

Indians are sick and tired of such kleptocratic politics!

The middle classes are the bulwark of any democracy, and every political revolution in history has relied on the strength of the youth. Lok Satta Party calls upon the youth and middle classes of the country to join us in this fight to free our democracy from the clutches of the criminal, corrupt, and dynastic politics that grips it today. Politics governs every aspect of our lives, and we must not run away from it. If good people avoid politics, we make it easy for criminals to fill the void.

Lok Satta Party needs your support to win this fight!Join hands with us to transform India, and build the democracy our children deserve.

Lok Satta has worked for over a decade to cleanse our political system of its current ills (visit http://www.loksattamovement.org/ to learn more). On March 23rd,2008 Lok Satta Party launched the Surajya campaign against corruption and for good governance, and we are committed to drawing the best from our society into public life. We need your financial contributions to mount an effective campaign for clean politics. In the three constituencies Lok Satta is contesting, our rivals will outspend us by at least 100:1. We need Rs.30 lakh to mount a credible, and legitimate campaign.

If a broad coalition of Indian citizens comes together, we can prove that the time has come for change. The rise of Barack Obama demonstrates the power of the youth and middle classes once they come together. Indian youth and middle classes are ready and waiting for change. We need to build a powerful movement to weld them into a viable political force.
So please support in any manner you can – particularly recurring contributions.

If you reside in India
If you reside abroad
Rs 200/month$ 10/month
Rs 500/month$ 25
Rs. 1000$ 50
Rs. 5000 $100
Any amount you feel necessary to usher in a new political culture in India.Any amount you feel necessary to usher in a new political culture India.

To learn more about Lok Satta Party, please visit http://www.loksatta.org/. To learn more about how you can help build this people’s movement to usher in a new political culture in India, please visit http://www.loksatta.org/contribute.htm. Information on how to set up recurring funds is also included.

Let us join hands, and bring the change we all want to see in our great country
Invite a friend to join Lok Satta Party in cleaning up Indian politics.

తెలుగులేఖ: ఇక్కడ మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చెయ్యమంటూ 10 వరుసలలో 20 టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. వాటిని తీసివేయడం జరిగింది.

Regards,

Jayaprakash Narayan
President, Lok Satta Party
http://www.loksatta.org/

Please forward this email to all concerned Indians and encourage them to join the cause of India.(and CC us at support@loksattaparty.com)

If you would like to unsubscribe, please email to info@loksattaparty.com with UNSUBSCRIBE in the subject line.

పూర్తి టపా చదవండి!

తెలుగు లో ఉచిత "ఫాన్సీ ఫాంట్స్ (Fancy Fonts)" లేవా?

23 April, 2008

నాకు ఫాన్సీ ఫాంట్స్ అంటే పిచ్చి. నా కున్న ఈ పనికి రాని అలవాటు వలన, నేను వెబ్ ని బ్రౌస్ చేస్తున్నప్పుడు కనపడిన ప్రతి ఫాన్సీ ఫాంట్ (Fancy Font) నీ నా సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసిచూస్తుంటాను. తరువాత వాటినుపయోగించి డాక్యుమెంట్స్ రాసి వాటిని ప్రింట్ చేసి స్నేహితులకి, సహోద్యోగులకి ఇస్తుంటాను. ఇంగ్లీష్ కి సంభందించి చాలా ఫాంట్స్ ని ఇన్ స్టాల్ చేసుకున్నాను. బేనర్, వాల్ పేపర్లు, లోగో బొమ్మలను తయారు చేయడంలో , వాటిని ప్రింట్ చేసుకోవడానికి ఈ ఫాన్సీ ఫాంట్ లు ఉపయోగ పడతాయి.ఆ రకంగా తెలుగు కు సంభందించి ఈనాడు, ఏపీ న్యూస్, పోతన, శ్రీ , తిక్కన , గౌతమి లాంటి ఫాంట్స్ నా సిస్టమ్ లో ఉన్నాయి. కానీ ఈ తెలుగు ఫాంట్స్ ని ఉపయోగించి టైప్ చేసినప్పుడు లేదా ఆ వెబ్ సైట్ లను చదివినప్పుడు అన్ని అక్షరాలూ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. అంటే ఇవేవీ కూడా ఫాన్సీ ఫాంట్స్ కావన్నమాట. ఈ మధ్యనే అనుకోకుండా "వేమన" అనే ఫాంట్ ని ఇన్ స్టాల్ చేయడం జరిగింది. ఆ తరువాత కూడలి సైట్ ని చూస్తున్నప్పుడు ఆ సైట్ అక్షరాలలో మార్పు ని స్ప్రుష్టంగా గమనించడం జరిగింది. పైన చూపిన అక్షరాల స్టైల్ గౌతమి అనే ఫాంట్ ని వాడినప్పటిది. పైన చెప్పిన మిగతా ఫాంట్ లను వాడినప్పుడు కూడా ఈ అక్షరాలు దాదాపు ఇలాగే కనిపించాయి. కాకపోతే గౌతమి ఫాంట్ తో అక్షరాలు బాగా స్ప్రుష్టం గా ఉన్నాయి. అదే సైట్ ని వేమన అనే ఫాంట్ ఇన్ స్టాల్ చేసినప్పుడు ఎలాఉందో చూడండి. అయితే ఈ ఎఫక్ట్ కోసం మన సిస్టమ్ లో ఇటువంటి ఫాంట్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. ఇటువంటి ఫాన్సీ ఫాంట్స్ ఉపయోగం ముఖ్యంగా ఇమేజ్ (Image) లను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. పైన చెప్పిన ఫాంట్స్ అన్నింటినీ వెబ్ నుంది ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును. మీకు మరేమైనా తెలుగు ఫాన్సీ ఫాంట్స్ తెలిస్తే క్రింద కామెంట్ చెయ్యడం ద్వారా తెలియపరచగలరు.

పూర్తి టపా చదవండి!

"మీకోసం" మా పాట్లు, రాలేనా మీ ఓట్లు?

21 April, 2008

నందమూరి వారి దన్నుతో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఆకాశమే అంచుగా సాగుతున్న అధికార పార్టీ అవినీతి కి వ్యతిరేకంగా సకల అస్త్ర శస్త్రాలతో టి.డి.పి. దండయాత్ర "మీకోసం" మొదలయింది. పైకి చెప్పే ఉద్దేశం ఏదైనా, ఓట్ల కోసమే ఈ పాట్లన్నది ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ యాత్రలో చంద్రబాబు అజెండా అధికార కాంగ్రేస్ పార్టీ అవినీతే గాక సామాన్యుడిని కాల్చేస్తున్న ధరల మంటలు, Y.S.R బంధుప్రీతి, SEZ ల పేరుతో వేలకొద్దీ ఎకరాల భూములను భోంచేస్తున్న భూబకాసురులు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు మొదలైనవి ముఖ్యమైనవి.(శాంతి భద్రతల విషయంలో మన రాష్ట్రం దాదాపు బీహార్ లా తయారవుతోందని మాటల సందర్భంలో మా మిత్రులు కొదరు బాధపడుతుంటారు). ఎన్నడూ లేని విధంగా ఈసారి చంద్రబాబుకి నందమూరి వంశస్తుల నుండి దాదాపు పూర్తి మద్దతు లభిస్తున్నది. బాలక్రిష్ణ, హరిక్రిష్ణ ముదలైన పెద్ద తలకాయలేకాక కళ్యాణ్ రామ్, జూ ఎన్.టి.ఆర్ లాంటి పిల్ల తలకాయలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. అయితే నెలక్రితం దాకా సీన్ లో లేని వీళ్ళు ఒకేసారి తెరమీదకు రావడానికి కారణం ఏమిటి? బాలక్రిష్ణ తో చంద్రబాబు సయోధ్య కొన్నేళ్ళ క్రితమే ఏర్పడింది. లోగుట్టు ఏమిటంటే బాలక్రిష్ణ ఇంటిలో కాల్పుల సంఘటన మూసివేసినందుకు ప్రతిఫలంగా బాలక్రిష్ణ కూతురు ని చంద్రబాబు కొడుకు లోకేష్ కి ఇచ్చారు. అప్పట్లో మిగిలిన నందమూరి వంశస్తులు చంద్రబాబు తో పెద్దగా కలవలేదు. గత కొద్ది నెలల నుండి చంద్ర బాబు పార్టీ లో కొంత ఇబ్బందికర పరిస్థితి ని ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా టి.డి.ఎల్.పి ఉపనేత దేవేందర్ గౌడ్ నుండి. ప్రస్తుత విషయం తీసుకుంటే, నందమూరి వంశస్థుల ఆగమనం దేవేందర్ గౌడ్ కి చెక్ పేట్టేందుకేనా? ఒకవేళ ఆంధ్రరాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితే వస్తే ఆ కొత్త రాష్ట్రాలలో కూడా తన బంధువులే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతోనే వారిని ఆహ్వానించారా? ఏదేమైనా "బెస్ట్ ఆఫ్ లక్" చంద్రబాబూ!

పూర్తి టపా చదవండి!

బాబోయ్ దెయ్యం - సాస్కెన్ కి వచ్చిన కొత్త కష్టం

19 April, 2008

బెంగళూరు లో వున్న టాప్ టెలీకామ్ కంపెనీ "సాస్కెన్ (Sasken) టెక్నాలజీస్" కి పాపం కష్టాల మీద కష్టాలు. క్రితం నెలలోనేమో కెనడా దేశానికిచెందిన లీ అనే ఒక పోకిరీ ఉద్యోగి వ్రాసిన కర్నాటక వ్యతిరేక పద్యానికి "కర్ణాటక రక్షణ వేదిక (K.R.V)" ఆగ్రహానికి గురిఅయింది. ఆ దాడిలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ విషయం మీద మరిన్ని వివరాలకు గూగుల్ చేయండి. లీ వ్రాసిన వివాదాస్పదమైన పూర్తి పద్యం Thatskannada.Oneindia.in లో ఉంది. మరో పక్క స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీ షేర్ వాల్యూ రోజురోజుకీ క్రిందికి పోతోంది. ఇవి చాలవన్నట్లు గోరుచుట్టు మీద రోకలిపోటులా గత కొన్ని రోజులనుండి సాస్కెన్ కి ఒక దయ్యం బెడద వచ్చిపడింది. ఐ.టి. కంపెనీ ఏంటి, దెయ్యం నమ్మకం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే పూర్తిగా చదవండి. దొమ్ములూరు (విమానాశ్రయం రోడ్డు) లో ఉన్న ఈ కంపెనీ ఆఫీసు కి ప్రక్కనే ఉద్యోగుల పిల్లలని ఉంచడం కోసం కొత్తగా ఒక ఇంటిలో చైల్డ్ క్రష్ ని ఏర్పాటు చేసుకున్నారంట. చిన్న చిన్న పిల్లలు గల ఉద్యోగులు, ఉద్యోగ వేళలలో తమ పిల్లలను ఈ క్రష్ లో ఉంచి ఆఫీస్ అయిపోయిన తరువాత తిరిగి ఇంటికి తీసుకెళుతూ వుంటారు. గత కొన్ని రోజుల నుండీ క్రష్ హోం లో విచిత్ర మైన సంఘటనలు జరుగుతున్నాయని ఆ క్రష్ హోం ఉద్యోగులు అంటున్నారట. అదిగో పులి ఆంటే ఇదిగో తోక అన్నట్లు, బక్కెట్లు వాటంతట అవే జరిగాయని, రాత్రి వేళల్లో ఒక తెల్లటి ఆకారాన్ని చూశామని కొంతమంది అంటున్నారు. చివరకి ఆ హోం ఉద్యోగులు మేమిక్కడ పనిచెయ్యం బాబో అంటే, ఆ విషయం కాస్తా టాప్ లెవల్ మేనేజ్మెంట్ కి వళ్ళిందట. దయ్యం అంటే వారు మటుకూ ఏంచేస్తారండి? ఆ విషయం ఏదో కనిపెట్టేవరకూ సాస్కెన్ ఆఫీస్ ఆడిటోరియం లో ఆ క్రష్ ని నిర్వహించమన్నారట. ఈ బ్లాగు వ్రాసే సమయానికి ఆ హోం ఆడిటోరియంలోనే నడుస్తోందని సాస్కెన్ లో పనిచేస్తున్న మిత్రుడు చెప్పారు.

పూర్తి టపా చదవండి!

బ్లాగ్ ఆధునీకరణ - సూచిక గుంపులు లేదా Label Clouds

04 April, 2008

నేను గత రెండు రోజులనుండి నా బ్లాగ్ ను నవీకరిస్తున్నాను. ఆందులో భాగంగా నిన్ననే బ్లాగ్ లేఔట్ ని మార్చి దానికి లేబుల్ క్లౌడ్ (Label Cloud) లేదా టేగ్ క్లౌడ్ (Tag Cloud) ని అమర్చాను. తెలుగు లో వీటిని సూచిక మబ్బులు లేదా సూచిక గుంపులు అని అందామా? నా బ్లాగ్ లేఔట్ ని బ్లాగ్ ఆండ్ వెబ్ అనే సైట్ నుండి తీసుకుని దానికి కొంత నా సొంత పైత్యాన్ని తగిలించి సుందరంగా తయారు చేశాను (అని అనుకుంటున్నాను). లేబుల్ క్లౌడ్ అనేది మీ బ్లాగ్ లోని అన్ని లేబుల్స్ లేదా టాగ్ ల సమాహారం. డిఫాల్ట్ గా బ్లాగర్ అన్ని లేబుల్స్ ని ఒక లిస్ట్ గా చూపిస్తుంది. అలా కాకుండా మీకు పైన బొమ్మలోని పసుపురంగు లో చూపినట్లుగా కావాలంటే మీ టెంప్లెట్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువగా ఉపయోగించిన లేబుల్స్ పెద్ద పరిణామం లో, తక్కువగా ఉపయోగించిన లేబుల్స్ చిన్న పరిణామంలో కనబడతాయి. మరిన్ని వివరాల కొరకు ఈ సైట్ ని చూడండి.

పూర్తి టపా చదవండి!

రైళ్ళ వివరాలను చెప్పే కొత్త వెబ్ 2.0 సైట్ (బీటా)

మీరెప్పుడైనా మన రైల్వే వెబ్ సైట్ కి లాగిన్ అయ్యారా. ఎలా ఉందంటారు? ఆ వెబ్ సైట్ స్పీడ్ కి భయపడేవారికోసమే ఒక కొత్త వెబ్ సైట్ వచ్చింది. ఈమధ్య నే ఈ కొత్త వెబ్ సైట్ ని చూశాను. విమల్ కుమార్ అనే ఆయన నడుపుతున్న ఈ సైట్ లో రైళ్ళ రాక పోకల గురించే కాక చాలా విషయాలను చాలా ఫాస్ట్ గా తెలుసుకోవచ్చును. ఈ సైట్ ఉపయోగిస్తున్న WEB2.0 టెక్నాలజి వలన కావలసిన డేటా చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఈ సైట్ ద్వారా క్రింద తెలిపిన వివరాలను తెలుసుకోవచ్చును.

  • రెండు ఊళ్ళ మధ్య ఉన్న అన్ని రైళ్ళ ను ఒకే స్క్రీన్ లో చూడవచ్చు
  • ఆ రైళ్ళు వారంలో ఎన్నిసార్లు తిరుగుతాయో తెలుసుకోవచ్చు
  • రైలు లో ఖాళీ లను తెలుసుకోవచ్చు
  • రైలు ప్రయాణించే మార్గాన్ని తెలుసుకోవచ్చు
  • రైలు వళ్ళే మార్గాన్ని map ద్వారా చూడవచ్చు
  • P.N.R పరిస్థితిని తెలుసుకోవచ్చు
అంతే కాకుండా మరో ఉపయోగం "ఫాస్టర్ రెస్పాన్స్". మీరు కూడా ఒకసారి ఉపయోగించి చూడండి. మరిన్ని వివరాలకొరకు ఈ బీటా సైట్ కి లాగిన్ అవ్వండి. ఈ సైట్ ఇంకా బీటా వెర్షన్ లోనే ఉన్నది, చివరి వెర్షన్ లో మరిన్ని సదుపాయాలు ఉండవచ్చు.

పూర్తి టపా చదవండి!

మీ టైపింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం ఎలా?

01 April, 2008

నేను ఈ ఐ.టి రంగం లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ, నా టైపింగ్ మటుకూ అంత స్పీడ్ కాదు ఎందుకంటే నేనెప్పుడూ టైపు నేర్చుకోలేదు. ఇప్పుడు బయట అది నేర్చుకొనే సమయం, తీరిక లేవు కానీ స్పీడ్ గా టైప్ చేయడం లో ఉండే మజా ఏమిటో మీ అందరికీ తెలుసు. ఈమధ్య నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు keybr అనే సైట్ ని చూశాను. టైపింగ్ మీద చాలా టూల్స్ మరియు సైట్ లు ఉన్నప్పటికీ, నాకు మటుకు ఈ సైట్ బాగా నచ్చింది. అది ఎందుకు నచ్చిందో మీరూ కూడా ఈ సైట్ లోకి వెళ్ళి చూస్తే గానీ మీకు తెలియదు.
దీనికి సంభందించిన కొన్ని ఫీచర్స్ ని ఇక్కడ ఇస్తున్నాను.
  • రియల్ టైమ్ లో అక్షరాలను, మాటలను చూపించడం
  • మన టైపింగ్ స్పీడ్ ని చూపించడం
  • మన టైపింగ్ తప్పులని చూపించడం
  • మన టైపింగ్ సంక్షిప్త సరళి ని గ్రాఫ్ రూపంలో చూపించడం

నా టైపింగ్ స్పీడ్ గ్రాఫ్ ని పక్కన ఉన్న బొమ్మలో చూడండి


పూర్తి టపా చదవండి!