ఈరోజు సాక్షి మొదటి పేజి లోని న్యూస్ "నట్ట నడి బజారులో నియమాలకు గోరి" ని చదివారా? నేను మొదట మొదటి పేజి లోని సంక్షిప్త వార్త చదివాను. నమ్మలేకపోయాను. అవురా, ఇది కలయా లేక జగన్మాయయా! సాక్షి మారుతుందా! ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిందా! ఇలా ఎన్నో ఆలోచనలు. ఆలోచనలకి స్వస్తి చెప్పి మొత్తం వార్త చెదువుదామని ఫుల్ స్టోరీ మీద క్లిక్ చేశాను. ?!@#$%^&* మబ్బులువిడిపోయెన్! కేవలం రెండే వరుసలు ప్రస్తుత సమస్యమీద, ఏడు పేరా గ్రాఫులు అంటే దాదాపు 40 వరుసలు, పది సంవత్సరాల క్రితం సంగతి మీద. జగన్ పేపర్ పెట్టింది బాకా ఊదడానికేనని అందరికీ తెలుసు గానీ ఆ ఊదేది ఏదో డైరెక్ట్ గానే ఊద వచ్చుగా?. N.T.R భవన్ మీద వేరే హెడింగ్ తో న్యూస్ వేసిఉండవచ్చు. తప్పు జరిగితే అది ఎప్పటిదైనా, ఎవరైనా శిక్షింపబడాల్సిందే. N.T.R భవన్ విషయం లో తప్పుజరిగితే దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు లేదా మరేదైనా చట్టబద్దంగా వ్యవహరించవచ్చు, ఇంకా కావాలంటే అందుకు బాధ్యులని జైలుకి పంపించవచ్చు. ప్రభుత్వం వారిదే కదా. ప్రస్తుత సమస్య భీమ్ రావు బాడ వాసులకు జీవన్మరణ సమస్య. దయచేసి ఆ సమస్యని పక్కదారి పట్టించవద్దు. అవురా, ఏమీ జగన్మాయ!
31 March, 2008
ఈరోజు సాక్షి మొదటి పేజి లోని న్యూస్ "నట్ట నడి బజారులో నియమాలకు గోరి" ని చదివారా? నేను మొదట మొదటి పేజి లోని సంక్షిప్త వార్త చదివాను. నమ్మలేకపోయాను. అవురా, ఇది కలయా లేక జగన్మాయయా! సాక్షి మారుతుందా! ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిందా! ఇలా ఎన్నో ఆలోచనలు. ఆలోచనలకి స్వస్తి చెప్పి మొత్తం వార్త చెదువుదామని ఫుల్ స్టోరీ మీద క్లిక్ చేశాను. ?!@#$%^&* మబ్బులువిడిపోయెన్! కేవలం రెండే వరుసలు ప్రస్తుత సమస్యమీద, ఏడు పేరా గ్రాఫులు అంటే దాదాపు 40 వరుసలు, పది సంవత్సరాల క్రితం సంగతి మీద. జగన్ పేపర్ పెట్టింది బాకా ఊదడానికేనని అందరికీ తెలుసు గానీ ఆ ఊదేది ఏదో డైరెక్ట్ గానే ఊద వచ్చుగా?. N.T.R భవన్ మీద వేరే హెడింగ్ తో న్యూస్ వేసిఉండవచ్చు. తప్పు జరిగితే అది ఎప్పటిదైనా, ఎవరైనా శిక్షింపబడాల్సిందే. N.T.R భవన్ విషయం లో తప్పుజరిగితే దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు లేదా మరేదైనా చట్టబద్దంగా వ్యవహరించవచ్చు, ఇంకా కావాలంటే అందుకు బాధ్యులని జైలుకి పంపించవచ్చు. ప్రభుత్వం వారిదే కదా. ప్రస్తుత సమస్య భీమ్ రావు బాడ వాసులకు జీవన్మరణ సమస్య. దయచేసి ఆ సమస్యని పక్కదారి పట్టించవద్దు. కలసి ఉంటే లేదు సుఖమా?
29 March, 2008
కలసి ఉంటే కలదు సుఖం. ఇది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు పనికి రాదు అని ప్రస్తుత రాజకీయ పార్టీల అభిప్రాయం లాగుంది. విశాలాంధ్ర విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కావాలని టి.ఆర్.ఎస్, భా.జ.పా లాంటి పార్టీలు ప్రత్యక్షం గానూ కామ్రేడ్స్ పరోక్షం గానూ, కాంగ్రేస్, టి.డి.పి లు గోడమీద పిల్లి వాటంగా ఎగదోస్తున్న ఈ కుంపటిలో చివరికి ఏమి జరిగినా ఇప్పటివరకూ పార్టీల గొంతులే కానీ సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వారి వాణి వినిపించే ప్రయత్నమే ఇప్పడివరకూ చేయలేదు. "భారత తెలుగు సంఘం" అట, ...నాకైతే ఇప్పటిదాకా ఈ సంఘం కార్యకలాపాల గురించి తెలియదు కానీ, వారు మటుకు ఈ విషయం మీద ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారట. ఈ సేకరణ కేవలం ఇంటర్నెట్ ద్వారానే కాబట్టి దీనిని కేవలం కొందరి ప్రజల అభిప్రాయం గా మాత్రమే పరిగణించగలం. అయితే ఎవరో ఒకరు మొదలు పెట్టారు, సంతోషం. మన వంతుగా మన అభిప్రాయం చెప్పడం ధర్మం. మీరుకూడా "భారత తెలుగు సంఘం" లోకి వళ్ళి మీ అభిప్రాయాన్ని వెల్లడించండి.
రహస్య ప్రణాళిక ఏదైనా ఉందో లేక తన హయాం లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్న అపప్రథ తనకంటుతుందనుకున్నారో (లేదా తను నల్ల సంపాదన అంతా ఆంధ్రమొత్తం విస్తరించి ఉందనో) ఎందుకో గానీ Y.S.R మత్రం ఇప్పటిదాకా కలసిఉండడానికే కట్టుపడ్డారు.
మూలం: ఈనాడు
పూర్తి టపా చదవండి!
రహస్య ప్రణాళిక ఏదైనా ఉందో లేక తన హయాం లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్న అపప్రథ తనకంటుతుందనుకున్నారో (లేదా తను నల్ల సంపాదన అంతా ఆంధ్రమొత్తం విస్తరించి ఉందనో) ఎందుకో గానీ Y.S.R మత్రం ఇప్పటిదాకా కలసిఉండడానికే కట్టుపడ్డారు.
మూలం: ఈనాడు
తక్కువ సమయం లో ఎక్కువ బ్లాగ్ లను చదవడం ఎలా?
27 March, 2008
మంచి బ్లాగ్ లను వ్రాయడం ఎంత కష్టమో వాటినుండి మనకు కావల్సిన వాటిని ఎంచుకోవడం కూడా అంతే కష్టం. నేను ఇంతకు ముందు దాకా నాకు కావల్సిన బ్లాగ్ చిరునామా లన్నింటినీ నా "Favorites" లో store చేసుకునేవాడిని. ఖాళీ దొరికినప్పుడల్లా అన్ని సైట్ లను చూసేవాడిని. ప్రతిసారీ ఇలా చేయడం చాలా ఇబ్బంది అందుకని ఇప్పుడు ఫీడ్ రీడర్స్ లేదా RSS/Atom అగ్రిగేటర్స్ ని వాడుతున్నాను. వీటి గురించి తెలియని వారికోసమే ఈ టపా. ... ఇవి online మరియు Desktop రూపాలలో ఉంటాయి. గూగుల్ రీడర్ అనేది online రూపానికి ఉదాహరణ.
నా గూగుల్ రీడర్ అమరిక ని మీరు పైనున్న బొమ్మలో చూడవచ్చు. అయితే బ్లాగ్ లను చదవాలనుకున్న ప్రతిసారి నేను గూగులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను చదవాలనుకున్న ప్రతిసారీ నెట్ అందుబాటులో ఉండాలి. దీనికి పరిష్కారమే offline రీడర్స్. ఉదాహరణకి న్యూస్ గెటార్. దీని ఉపయోగం ఏమిటంటే నెట్ అందుబాటులో ఉన్నప్పుడు మనం ఎంచుకున్న బ్లాగ్ లన్నిటినీ download చేసి మన system లోనే సేవ్ చేస్తుంది. నా న్యూస్ గేటార్ అమరిక ని మీరు పక్కన చూడవచ్చు. కూడలి, జల్లెడ, తేనెగూడు, తెలుగు బ్లాగర్ మొ అన్నీ నా రీడర్స్ లో ఉన్నాయి. తేనెగూడు ని మాత్రం నా న్యూస్ గెటార్ లో ఉంచలేకపోయాను ఎందుకంటే ఆ సైట్ ఫీడ్ లో ఏదో లోపం ఉన్నట్లు ఫీడ్ వేలిడేటర్ చెబుతోంది. అది సరిచేసేంత వరకు నేను ఉపయోగించలేను.(పెద్ద బొమ్మలకోసం ఫొటోల మీద క్లిక్ చేయండి)
పూర్తి టపా చదవండి!
Posted by Chaks at 6:24 PM 1 comments Links to this post
Favourite:
Labels: ఉపకరణాల విశ్లేషణ, తెలుగు
సాక్షి - నిజమైన సాక్షా లేక దొంగ సాక్షా?
24 March, 2008
సాక్షి తెలుగు దిన పత్రిక ఎట్టకేలకు మొదలయ్యింది. మా’ టివి లో ప్రారంభోత్సవ కార్యక్రమం ని చూసాను. మాట్లాడిన వారంతా, సాక్షి మీద / జగన్ మోహన్ రెడ్డి గారి మీద చాలా నమ్మకంగా ఉన్నారనిపించింది. పత్రిక మొదలు కాకముందే 15 లక్షల మంది చందాదారులుగా చేరారని అనధికార వార్త. అదే సమయం లో ఈనాడు కి 10 లక్షలు మరియు అంధ్రజ్యోతి కి 5 లక్షల మంది చందాదారులట! మొన్నీమధ్యనే మొదలైన సూర్య పత్రిక 1 లక్ష దగ్గర చతికిల పడిందట. ఈ సూర్య పత్రిక వెబ్ సైట్ కోసం Google లో చాలా వెతికాను. ఒక లింక్ (సూర్య తెలుగు డైలీ) దొరికింది కానీ ఇది నిజమైన లింక్ అవునో కాదో ఇంకా తెలియదు. సాక్షి పత్రిక అంతా రంగుల పేజీలే కాబట్టి అందరికీ ఆకర్షణ గానే వుండవచ్చు, మొదటి సంవత్సరం కాబట్టి కొద్దిగా నైనా తటస్తం గా వుండవచ్చు (నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదు!). గత 4 ఏళ్ళ పరిపాలనను బట్టి, నా వుద్దేశం ప్రకారం వీరికి అధికారం చేతిలో వుంది కాబట్టి చందాదారుల సంఖ్య పెంచుకోవడం పెద్ద సమస్య కాదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చందాదారులను పెంచుకోవాలంటే దానికి చాలా మర్గాలున్నాయి. ఇకముందు మీ సాక్షి చందా నంబరు (బహుశా కాంగ్రేస్ లేదా ఈ ప్రభుత్వం వున్నంత వరకు) చాలా ముఖ్యం కావచ్చు, ఉదాహరణకి, మీ గ్యాస్ రీఫిల్ కి, ఇందిరమ్మ గృహానికి, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ లకు మొదలైనవాటికి (ష్!!! అంతా అనధికారికంగానే...). Any way, best of luck Mr. Jagan and letz hope for good. ఏదేమైనా మా’ టివి లో C.P.I నారాయణ గారు చెప్పినట్టు ఈ "సాక్షి" పత్రిక కోర్టు ల దగ్గర దొరికే దొంగ సాక్షుల లాగ దొంగ సాక్ష్యం చెప్పదని ఆశిద్దాం.
Update: Updated with Sakshi website address సాక్షి
పూర్తి టపా చదవండి!
Subscribe to:
Posts (Atom)




