సదుద్దేశం తెచ్చిన ఆదృష్ఠం

09 June, 2008

ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడానికి లాటరీ మార్గాన్నెంచుకున్న వ్యక్తికి లాటరీ తగిలి కోటిరూపాయలు చేతికందాయి. ముస్తపా బీరోలీ (ఫొటోలో వ్యక్తి) అనే వ్యక్తి దుబాయ్ లో పనిచేస్తున్నాడు. అతనికి నిస్సార్ అనే స్నేహితుని ద్వారా నౌషాద్ అనే అతని పరిచయం ఏర్పడింది. ముస్తఫాదీ మరియ నౌషాద్ అనేవ్యక్తిదీ ఒకే ప్రాంతం కేరళలోని కుంజిపల్లి కావడంతో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. నౌషాద్ తండ్రి ఒక మత్స్యకారుడు, ఆయన కేన్సర్ తో మరణించడంతో నౌషాద్ ఉద్యోగ నిమిత్తం, అప్పటికే దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న సోదరుని సాయంతో దుబాయ్ లో ఒక హోటల్ లో పనికి కుదిరాడు. కొన్నాళ్ళ తరువాత ఎడమ కాలి రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడి కాలు వాయడంతో దుబాయ్ లోనే ట్రీట్‍మెంట్ తీసుకున్నాడు. అక్కడ ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ కావడంతో అతని సోదరుడు కేరళకు పంపించి వేశాడు. కేరళలో ఒక బ్యాంక్ నుండి రుణం తీసుకుని వైద్యం పూర్తిచేసుకుని మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి దుబాయ్ వెళ్ళి మళ్ళీ హోటల్ పనిలోచేరాడట. స్నేహితుని కోసం ఏదైనా చేయాలని అనుకున్న బీరోలీ, ఇదివరకూ లాటరీకొనే అలవాటు లేనప్పటికీ ఒక లాటరీ టికెట్ కొన్నాడట. అదృష్టం పండి దానికే ఒక మిలియన్ దిర్హామ్ ల డబ్బు చేతికొచ్చింది. దాంతో స్నేహితుని ట్రీట్‍మెంట్ అప్పు 60,000 తో పాటుగా తాను చేయాలనుకున్న ఇతర మంచి పనులన్నీ చేయొచ్చని బీరోలీ తెగ ఆనంద పడిపోతున్నాడు. అలాగే కొంత డబ్బుని ఏడుగురు సభ్యులున్న తన స్వంత కుటుంబ అవసరాలకు వాడుకుంటానినికూడా అన్నాడు.
మరిన్ని వివరాలు గల్ఫ్ న్యూస్ ద్వారా:

ఈ న్యూస్ కొన్ని పేరాలు చదివిన తరువాత ఎంత మంచి మనసో అనిపించినా చివరికి వచ్చేసరికి నాకూ ఓకోటి లాటరీ వస్తే లక్షని మంచి పనులకి ఖర్చు పెట్టడానికి వెనుకాడుతానా అనిపించింది. అందరూ ఇలాగే ఆలోచిస్తారా? ఏమో!

0 comments: