అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగింది తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీసిల్, వంట గ్యాస్ ల రేట్లను భారీగా పెంచింది. ఈ పెట్రో ఉత్పత్తుల పెంపువలన కూరగాయల ధరలు పెరగొచ్చు, ఉప్పు పప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగొచ్చు, పాల ధర పెరగొచ్చు, హోటల్ లో పెట్టే తిండి ధర పెరగొచ్చు, సైకిళ్ళ రేట్లూ పెరగొచ్చు, జట్కా బళ్ళ మరియు ఎద్దుల బళ్ళ కి డిమాండ్ పెరిగి వాటిరేట్లూ పెరగొచ్చు, సిమెంటు రేటు పెరగొచ్చు, ఉక్కు రేటు పెరగొచ్చు, టాటాల లక్షకారు రేటు లక్షన్నర కావచ్చు, బస్సు చార్జీలూ పెరగొచ్చు, .... .... .... .... .... .... .... ... ... . ఈనాడు ఆంధ్రజ్యోతి వగైరా దినపత్రికలు నాల్గురూపాలవ్వచ్చు, కానీ... ఆంధ్రావాలా అదృష్టం సాక్షి రేటు ఎన్నటికీ మారదు, అది ఎప్పటికీ రెండు రూపాయలే! రండి.. సాక్షి రంగుల లోకంలో మైమరచిపోండి, 32 పేజీల సమాచార ప్రవాహంలో కొట్టుకుపోండి!
Subscribe to:
Post Comments (Atom)





0 comments:
Post a Comment