లేబర్ రైలు: ఆలూ లేదూ.. చూలూ లేదు...

04 June, 2008

కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ఈ లేబర్ రైలు పరిస్థితి. చిరు తన పార్టీకి పేరు ఇంకా పెట్టాడో లేదో గానీ చిరు చిరు అభిమానులు మాత్రం పేపర్లలో వచ్చిన వార్తలని పట్టుకుని తమ టేలంట్ ని నిరూపించుకుంటున్నారు. ఈమధ్యన పేపర్లలో చిరు పార్టీ పేరు లేబర్ పార్టీ అని, రైలు బండి పార్టీ గుర్తు అని వచ్చిన పుకార్లకు చిరు అభిమానుల సమాధానం ఇదిగో, ఈ క్రింది బొమ్మ. ఇందులో నిజమెంతో గానీ ఇది చిరంజీవి పార్టీ అధికారిక జెండా అన్నంతగా ప్రచారం చేసేస్తున్నారు. బ్రతికేది కొద్దికాలమైనా, మహారాజులా బ్రతకాలని సామెత. ప్రస్తుతం ఈ జెండా అంతర్జాలంలో మహారాజభోగం అనుభవిస్తోంది అనడం అతిశయోక్తి కాదేమో!
[ఈ బొమ్మ నాకు ఈమెయిల్ ద్వారా ఒక స్నేహితుడివద్దనుండి వచ్చింది. ఈ బొమ్మ యొక్క హక్కులు దాని అసలు యజమానివే, నావి కాదు.]

3 comments:

Anonymous said...

Looks like some 'techie' fan based in the US has designed this. 'Labor' instead of 'Labour'

Chaks said...

@Anonymous: This is not a 'techie' word i feel, both are meaningful words and has same meaning. however 'labor' is used in parties like Australian labor party(http://www.alp.org.au/). Another variant term is colour & color

Anonymous said...

Chaks,
My emphasis was on 'US' rather than on 'techie'. 'Labor' is how the Americans spell the word (now I know the Aussies too spell it without the 'U', thanks to you). My theory was, if it is a Telugu living in the States, he must be a techie.

అవునూ, బొగ్గింజను చిహ్నంగా పెట్టుకున్నారు, ప్రజల ముఖాలకు పూయబోయే మసికి గుర్తుగానా?