డైనమైట్స్ ఆఫ్ స్పామ్

02 June, 2008

కొన్నాళ్ళ క్రితం డూఇట్ (డైనమైట్స్ ఆఫ్ ఐ.టి) వారి వెబ్ సైట్ మీద ఒక టపా వ్రాశాను. అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా లేనప్పటికీ వారి సైట్ లోని మీటింగ్స్ సెక్షన్ లో మూడు రోజులక్రితం లొకేషన్ మేప్ అనే ఫీచర్ ని కలిపారు. మాప్ అంటే, మీటింగ్ జరిగే స్థలానికి ఎలా వెళ్ళాలో తెలిపే డైరెక్షన్ మాప్ అన్నమాట. ఇంతకీ ఈ టపా వ్రాసిన ఉద్దేశం వేరు .ఎందుకు వ్రాస్తున్నానంటే ఆమధ్య ఈ సైట్ గురించి వ్రాయడానికి నా ఈమెయిల్ ఐ.డి ని ఈ సైట్ కి ఇవ్వడం జరిగింది. నాలుగు రోజులక్రితం అశోక్ కుమార్ అనే ఆయన అందరికీ వెల్‍కం చెబుతూ ఒక ఈ మెయిల్ వ్రాశారు. ఆయన కావాలని చేసిన తప్పో లేక పొరపాటో గానీ దాదాపు 500 ఈమెయిల్ చిరునామాలను "To" లో పెట్టి ఈ మెయిల్ ని పంపించారు. ఇక చూస్కోండీ, ఆ ఈ-మెయిల్ గొలుసులో ఉన్న ప్రతిఒక్కడూ అందరికీ రిప్లై కొట్టడం అదికూడా చిరంజీవి పేరుమీద ఇది చేద్దాం, అది చేద్దాం అంటూ. కొందరి ఉద్దేశం బాగున్నా మరికొందరు పంపిస్తున్న మెయిల్స్ అయితే మరీ ఫన్నీగా ఉన్నాయి, వీళ్ళల్లో ఈ త్యాగబుద్ధి, పరోపకార గుణం ముందునుండీ వున్నాయా లేక చిరు రాజకీయ ప్రవేశం ప్రటన తరువాత హఠాత్తుగా ఊడిపడ్డాయో అర్థంకావడం లేదు, వీలున్నప్పుడు వాటన్నింటినీ కన్సోలిడేట్ చేసి ఒక టపా వ్రాస్తాను. నేను రిజిస్టర్ చేసుకుంది కేవలం అడ్మిన్ నుండి ఏమైనా తాజా న్యూస్ వస్తుందేమోననే కానీ అందరూ పంపించే చెత్త కోసం కాదు. ఈ నాలుగురోజుల్లో దాదాపు 80 ఈ-మెయిల్స్ వచ్చాయి. వీటిద్వారా భవిష్యత్తులో ఎంతమంది మార్కెటింగ్ వాళ్ళు మెయిల్స్ పంపిస్తారో, ఎంతమంది వైరస్ మెయిల్స్ పంపిస్తారో? అప్పుడే రెండు ఈమెయిల్స్ డొమైన్ మార్కెటింగ్ మీద వచ్చాయి. దీనిమీద ఈ అశోక్ అనే ఆయనకి ఒక మెయిల్ కొట్టాను, కానీ ఆయన నుండీ రిప్లై లేదు, వస్తుందని కూడా ఆశించడం లేదు. నేను పంపిన ఈమెయిల్ క్రింద ఇచ్చాను. మీరు మాత్రం మీ ప్రైమరీ ఈమెయిల్ ఐ.డి ని ఈ సైట్‍లో ఇవ్వవద్దు.

0 comments: