మీకందరికీ తెలుసు ఈనాడు కానీ, సాక్షి లేదా ఆంధ్రజ్యోతి లాంటిపేపర్ ల పాత ఎడిషన్ చూడాలంటే ఏంచేయాలో. మీకు తెలుసని నాకు కూడా తెలుసు కానీ ఈ టపా ఎందుకు రాస్తున్నానంటే ఈనాడులో మీకు తెలియని ఒక ట్రిక్ చెప్పడానికి అంతేగాక ఇందాక నా బ్లాగు ఎనాలసిస్ చూస్తున్నప్పుడు ఈరోజు కొందరు గూగుల్ లో పాత ఎడిషన్ కోసం వెతుకుతున్నట్టుగా చూపించింది. దానిమీద ఒక టపా ఎందుకు రాయకూడదనిపించింది. ఇది మీలో కొందరికైనా ఉపయోగపడితే సంతోషం. ఈనాడు మొదట్లో తన వెబ్ ఎడిషన్ లో ఒక వారం క్రితం పేపర్లను మాత్రమే చూడనిచ్చేది. కానీ ఆ తరువాత గత 90 రోజుల పాత పేపర్ లను చూడడానికి అనుమతించడం మొదలెట్టింది. దీనికోసం ఈనాడు సైట్ కి వెళ్ళి పైన నీలి రంగు పట్టీలో ఉన్న ARCHIVES అనే పదం మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత వచ్చిన పేజీలో నుండి కావల్సిన తారీఖుమీద నొక్కితే మీకు కావల్సిన పాత పేపర్ చూపెడుతుంది.
ఆంధ్రజ్యోతి ఒక వారం పాతపేపర్లను చూడడానికి అనుమతిస్తుంది. ఆంధ్రజ్యోతి సైట్ కి వెళ్ళి అన్నిటికన్నా పైనున్న వరుసలో ఉన్న Archives అనే లింక్ మీద నొక్కాలి. ఆ తరువాత వచ్చిన పేజీలో నుండి కావల్సిన తారీఖుమీద నొక్కితే మీకు కావల్సిన పాత పేపర్ చూపెడుతుంది.
సాక్షి కూడా పాత సంచికలను చూడనిస్తుంది అయితే ఎన్ని రోజుల పాత పేపర్ చూడొచ్చో ఆ సైట్ లో ఇవ్వలేదు. సాక్షి సైట్ కి వెళ్ళి అన్నిటికన్నా పై వరుసలో ఉన్న పాత సంచికలు అన్న లింక్ మీద నొక్కాలి. ఆ తరువాత వచ్చినపేజీలో ఉన్న క్యాలెండరు నుండి మనకు కావల్సిన తారీఖు ను ఎంచుకొని పక్కనున్న బటన్ ని నొక్కితే మనకు కావల్సిన పాత పేపర్ చూడొచ్చు.
ఈనాడు ట్రిక్: ఒక ట్రిక్ ని ఫాలో అవ్వడం ద్వారా ఈనాడు లో మనం 90 రోజులకన్నా ఎక్కువ రోజుల్లోని పాతపేపర్ ని
చూడొచ్చు. ఈరోజు నేను ఆర్కైవ్ మీద నొక్కినప్పుడు పక్కనున్న బొమ్మ చూపించింది. అంటే నేను ఫిబ్రవరి 29 నుండి నేటి వరకూ పాత పేపర్ ను చూడవచ్చు. కానీ మీ బ్రౌజర్ లో ఉదాహరణకి http://www.eenadu.net/archives/archive-1-2-2008/home.asp అనే అడ్రస్ టైప్ చేయండి. అప్పుడు నేను ఫిబ్రవరి ఒకటి నుండి నేటి వరకూ పాత పేపర్ చూడొచ్చు. అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా కొన్ని రోజుల వెనుక పేపర్లనుకూడా మనం చదవవచ్చు.ఆంధ్రజ్యోతి ట్రిక్:అలాగే ఆంధ్రజ్యోతి ఒకవారం కంటే పాత పేపర్ కావాలంటే ఆ ఆడ్రస్ లోని తారీఖుని మార్చితే సరి అంటే ఉదాహరణకి http://www.andhrajyothy.com/archives/archive-2008-5-7/index.asp ఆడ్రస్ ద్వారా జ్యోతిలో గరిష్టంగా ఈ పద్ధతిలో మూడువారాల పేపర్ ని చూడొచ్చు.
గమనిక: మీరు కొన్ని రోజుల తరువాత ఈ ట్రిక్ ట్రై చేస్తే అడ్రస్ లోని తారీఖుని కూడా అదే నిష్పత్తిలో మార్చాలి. నేనీ టపా రాసేసమయానికి ఈ ట్రిక్స్ పనిచేస్తున్నాయి. ఈ టపా చూసి వాళ్ళు ఈ ఫీచర్ ని తీసేయవచ్చేమో కూడా! మీకు ఈ ట్రిక్ పనిచేసినా చెయ్యకపోయినా క్రింద కామెంట్లో చెప్పండి.





2 comments:
అసలిన్నాళ్లూ archives అనే లంకె ఒకటుందనేసంగతే గమనించలేదు నేను. పాత ఆదివారం సంచికలో వచ్చిన ఒక కథను చదవాలనుకొని చదవలేకపోయాను. ఇప్పుడు కుదిరింది. నెనర్లు.
http://www.eenadu.net/archives/archive-4-5-2008/htm/2vnewkatha.asp
thanks, this artical useful
Post a Comment