డైరెక్టుగా ఆయన చెప్పకపోయినా సన్నిహితులచేత చెప్పిస్తున్నాడు. సొంత తమ్ముడుకూడా మొన్నామధ్యనే అమెరికా సభలో ఈవిషయం మీద ప్రామిస్ కూడా చేసాడు. మహిళా సంఘాలకు సంబంధించిన శిక్షణాతరగతులు జరుగుతున్నాయని తెలుగు పేపర్లు కూడా వారానికో న్యూస్ వేస్తున్నాయి. ఆయన అంగరక్షణకు ప్రత్యేకంగా కొంతమంది విశ్వాసపాత్రులకు ట్రైనింగునికూడా ఇస్తున్నట్టు కొన్నాళ్ళక్రితం ఒక పేపర్ ఫోటోలతో సహా కధనం ప్రచురించింది. పేరు ఖరారైందని, చెన్నైలో పాంప్లేట్లు ముద్రిస్తున్నారని ఇలా అంతా పాజిటివ్ గానే చెబుతున్నారు. ఆయనకూడా మరికొన్ని నెలల్లో మంచిముహూర్తం చూసుకుని తన నోటిద్వారా తనే ఆ విషయం చెపుతాన్నారు. మధ్యలో వీళ్ళగొడవేంటో తెలియడంలేదు. నాకుకూడా ఆయనంటే అభిమానమే అదికూడా నటుడిగా కాదు కేవలం ఒక సంఘసేవకుడిగా మాత్రమే. ఎప్పుడో ఒకసారైతే పర్లేదు, రోజుకొకరు ఒకచిన్న గుంపును తయారుచేయడం ఆయనరాజకీయాల్లోకి రావాలంటూ రోడ్లెక్కడం తద్వారా టీ.వీలు/పత్రికలకెక్కడం. ఆయన రానంటే ఇవన్నీ అవసరమేమో (ఎవరి స్వేచ్చ వారిది, ఆయన రానంటే బలవంతపెట్టే హక్కు ఎవరికుంది) గానీ నేనొస్తానుమొర్రో అంటుంటే వీళ్ళకేం బాధ. వీళ్ళు నిజంగా అభిమానించేవారా లేక ఆ ముసుగులో అందలాలెక్కుదామనే రాజకీయ ఊసరవెల్లులా? ఆ నోట ఈ మాట వచ్చేదాకా ఆగలేరా?
Subscribe to:
Post Comments (Atom)





1 comments:
కనిపించీ కనిపించనట్టు, వినిపించీ వినిపించనట్టు, చూపించీ చూపించనట్టు...ఇక వచ్చీరానట్టు ఊరిస్తే ప్రజలకి కాస్త excitement ఎక్కువై ఇలా ప్రజలు కొట్టేసుకుంటునారు సార్! ఇక అభిమానుల వేషాల్లో future రాజకీయ ఆశాజీవుల సంగతి షరామామూలే.
Post a Comment