నిజానికి నాకూ గందరగోళంగా ఉంది. ఆవుల్లో ఆడ ఆవులూ, మగ ఆవులూ వుంటాయా? నా ఉద్దేశం ప్రకారం ఇది ఎద్దే ఎందుకంటే పొదుగు కనబడడంలేదు. కానీ ప్రపంచం అంతా దీన్ని ఆవు అంటున్నారు (కొమ్ములు లేవనా?) కాబట్టి నేనూ అదే అననా? ఇది ఏదో మీరే చెప్పండి. దీని ఎత్తు ఆక్షరాలా ఆరడుగులా ఏడంగుళాలంట. వీటి జాతిలో ప్రస్తుతం ఇదే నెంబర్-2. బ్రిటన్ లో మటుకూ ఇదే నెంబర్-1. ప్రపంచ నెంబర్-1 కి దీనికీ వున్న తేడా కేవలం ఒక అంగుళమే. అయితే ఇది ఇంకా ఎదిగే వయసులోనే ఉంది కాబట్టి త్వరలోనే గిన్నిస్ బుక్ లో మొదటి స్థానం లభించవచ్చు.ఇది ఇంతకీ ఆవా లేక ఎద్దా అన్నవిషయం గురించి చర్చ జరుగుతున్నది డెయిలీమెయిల్ అనే యూ.కె వెబ్ సైట్ లో. పక్క బొమ్మ కూడా అక్కడినుండే. మరిన్ని విషయాలకు ఆ సైట్ చూడండి.
ఆ! మరో విషయం చెప్పడం మరిచాను, అక్కడ ఇచ్చిన కామెంటలలో మజీద్ అనే వాడు ఇచ్చిన కామెంట్ చూడండి. నీ అవ్వారేడవ్వా!(దీనికి మీనింగేదీలేదు) ఇండియా వాళ్ళెంత చీపయ్యారురా నీకు. వీడు ఖచ్చితంగా పాకిస్థాన్ వాడేనని నా గట్టి నమ్మకం
| This cow should be sent to India to be worshipped BIG TIME! - Majid, Australia, 13/5/2008 14:37 |





3 comments:
అయ్యా బ్లాగరు గారూ! అది ఆవు అని ఎవరన్నారు. అందరూ ఎద్దు అనే అంటున్నారు కదా. బహుశా మీరు హెడ్ లైన్స్ లో cow అని చూసి పొరబడి ఉంటారు. cow అంటే పశువు అని అర్థం (a domestic bovine animal regardless of sex or age)
అనానిమస్ గారు: మీ డిఫనెషన్ చూశాక దాదాపు నెట్ అంతా వెతికాను. oxford డిక్షనరీ(http://www.askoxford.com/concise_oed/cow_1?view=uk) అర్ధం "a fully grown female animal of a domesticated breed of ox"
మీరు చెప్పింది కూడా కరెక్టే కొన్ని డిక్షనరీలలో ఎద్దులని కూడా cow అంటారని ఉంది.ఈ డౌటు నాకు మాత్రమే వచ్చిందికాదు, ఇంగ్లీషు నేలలో పుట్టిపెరిగిన కొందరికికూడా, అక్కడి సైట్ లోని కామెంట్ సెక్షన్ చూడండి.
నేను చదువుకున్నప్పుడుమాత్రం cow అంటే ఆవు అని, bullock అంటే ఎద్దు అనిమాత్రమే చెప్పేవారు పాఠ్యపుస్తకాల్లోకూడా ఇలాగే ఉండేది. ఇంతకీ తెలియకడుగుతాను ఆవుని ఆంగ్లంలో ఏమంటారు?
chadavakamundu kAkarakaya... annaTTuMdi, 'cow' ante aavu kaada? dictionaryni correct gaane choosara? manadeesam loo matram "cow" ante aave nani naa vuddesam. 'cow' mEda mIru rAsina vyasam gurtulEdaa?
Post a Comment