పార్టీల సమాచారం ప్రజల హక్కే: ఈ చట్టం ద్వారా రాజకీయపార్టీలకు పార్టీ ఫండ్ లు ఎక్కడినుండి వచ్చాయో
ఐ.టీ. డిపార్ట్మెంట్ ద్వారా మనం తెలుసుకునే వీలుంది. మనలాంటి వాళ్ళం తెలుసుకునీ ఉపయోగం ఏముంటుంది లేండి కానీ దీని ముఖ్యౌద్దేశం ఏమిటంటే రాజకీయాల్లో నల్లడబ్బుని అరికట్టడం. కానీ రాజకీయ పార్టీల నల్ల డబ్బుని ఈ హక్కు ద్వారా ఎలా ఎదుర్కోగలమో నాకర్ధంకావడంలేదు. ఎవరైనా గానీ లోక్ సత్తా ఎప్పటినుండో దీన్ని గురించి చెబుతోంది. తమ తెల్లడబ్బునే ఐ.టి. రిటర్న్స్ లలో చూపిస్తారు గానీ నల్లడబ్బుని కాదు. అలా వచ్చిన నల్లడబ్బునే ఎన్నికల్లో కుక్కలకు బిస్కట్లు వేసినట్టు ప్రజలకు వెదజల్లుతారు లేదా ఏ పేపర్ ఫ్యాక్టరీనో లేదా ఏ మాల్ లాంటివో పెట్టుకుంటారు. వారిని అడిగేదెవరు అడిగినా చెప్పేదెవరు. సత్ఫలితాలనిస్తుందో చెప్పలేం కానీ నిస్సందేహంగా ఇది ఒక మంచికి మొదలు అనుకోవచ్చు. ఈ నిర్ణయం వలన రాజకీయాలకు ఏదైనా మేలుజరుతుంది అని మీరనుకుంటున్నారా?
ఎంపీలకూ లక్ష్మణ రేఖ: లోక్ సభ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఎం.పి. లను శిక్షించాలని లోక్ సభ హక్కుల సంఘం పార్లమెంటుకు సిఫార్సు చేసిందట. ఆ నియమావళిని ఉల్లంఘించిన వారికి 4 అంచెల శిక్షలు విధిస్తారట.
౧. మందలించడం
౨. చీవాట్లు పెట్టడం
౩. నిర్ణీత కాలంపాటు నిషేధించడం
౪. బహిష్కరించడం
నా ఉద్దేశంలో పై నాలుగింటికీ వలన పెద్దగా ఉపయోగంలేదు ఎందుకంటే అవి ఎం.పి ల అవినీతిని ఆపలేవు . వాటితో పాటుగా వారి ప్రవర్తన IPC క్రింద నేరమైతే చట్టప్రకారం చర్యకూడా తీసుకోవచ్చట. ఇదెంతవరకూ సాధ్యమో ఆలోచించండి. ఇప్పటికే శాసన వ్యవహారాలలో చట్టం తలదూరుస్తుందని పెద్దతలకాయలన్నీ వాపోతున్నాయి. పైన చెప్పిన వాటిలో "బహిష్కరించడం" అంటే కేవలం సభనుండి శాస్వతంగా పంపించడమా లేక ఎం.పి గానే తొలగించడమా? ఆ సభ్యులను ఎం.పి లుగా తొలగించడమే కాక వారుగానీ వారి కుటుంబసభ్యులుగానీ మళ్ళీ కొన్నేళ్ళ పాటు రాజకీయాల్లోకి రాకుండా నిషేధించే చట్టం ఉంటేనే ఇలాంటివాటికి చెల్లు చీటి. ఈ కొత్త నిర్ణయం తో ఎం.పి లలో అవినీతి పోతుందని మీరనుకుంటున్నారా?





1 comments:
nenu kuda sariggaa ee rendu vaartalne mukhyamayinavigaa bhaavinchaanu. chaala mukhyamainavi.
Post a Comment