ప్రక్క లోగో చూడగానే మీలో చాలా మందికి ఈపాటికే అర్ధమైపోయుంటుంది నేను దేనిగురించి చెబుతున్నానో. ఒకప్పుడు జెమినీ టి.వీ లో ప్రతీ ఆదివారం రాత్రి 8:30 గంటలకి ప్రసారమై అందరి అభిమానాన్ని (కనీసం నా అభిమానాన్ని) సంపాదించుకున్న ఈ సీరియల్ ఒక కామెడీ సీరియల్. కేవలం నాలుగు ముఖ్య క్యారెక్టర్ లు తో ఏ వారానికి ఆవారం కధ ఐపోయేలా వచ్చిన ఈ సీరియల్ నాకు నచ్చేది. అప్పుడప్పుడూ వాళ్ళ భార్య కేరక్టర్ లు కూడా ఎంటరయ్యేవి. ఒక బడుగు హోటలోడు త్వరగా ధనవంతుడవ్వడానికి తనమిత్రుడితోకలిసి చేసే పనులే ఈ కధ యొక్క థీమ్.అమృతరావ్ క్యారెక్టర్ లో ఇద్దరు నటులు (ఒకరు గుర్తులేదు, రెండవవాడు సినిమా యాక్టర్ నరేష్) మారి చివరగా హర్షవర్ధన్ సెటిలయ్యాడు.
అంజి గా పిలవబడే ఆంజనేయులు పాత్రలో గుండు హనుమంతరావు శహభాష్ అనిపించాడు.
సర్వం గా పిలవబడే సర్వేశ్వర్రావు పాత్ర నటుడు ఎవరో తెలియదు
నాల్గవవాడు అప్పాజి, ఈయన అసలుపేరూ నాకు తెలియదు. ఈయన ఈ హోటలున్న ఇంటికి ఓనర్
మొత్తం సీరియల్ బ్రహ్మాండం అని చెప్పలేను కానీ 80 శాతం ఎపిసోడ్ లు మాత్రం వీర సూపర్ గాఉంటాయి. ఈ సీరియల్ ని ఎందుకనో జెమినీలో త్వరగా, హడావిడిగా ముగించేసారు అనిపించింది. ఇదే సీరియల్ మళ్ళీ మాటి.వి లో మొదలయింది. ప్రస్తుతం మా లో వచ్చేది రీమేక్ అనుకుంటా ఎందుకంటే ఈ ఎపిసోడ్లు జెమినీలోవచ్చినప్పుడు నేను చూసిన గుర్తులేదు ముఖ్యంగా నరేష్ నటించినవి. సినిమా హీరో నరేష్ అమృతంగా మిగిలిన క్యారెక్టర్ లలో మార్పులేకుండా మా’లో వస్తుంది. మొన్న ఆదివారమో సోమవారమో అనుకుంటా
వచ్చిన ఒక ఎపిసోడ్ లో నరేష్ నటన మీరెవరైనా చూశారా? నరేష్ అందులో ఒక ఎగ్జామ్ కి అటెండ్ అవుతాడు, ఐదు నిమిషాల సీను. దీన్ని చూసినవారెవరికైనా Mr. బీన్ "Bean Taking The Exam" సీన్లు గుర్తురాకమానవు. బీన్ సీరియల్ ని తెలుగులోకి డబ్ చేస్తే ఇలా ఉంటుందో అలాగే మక్కికి మక్కి నటనని కాపీ చేశాడు. చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. నరేష్ లాంటి మెచ్యూర్డ్ నటుడికి ఇది అవసరమా ఆఖరికి సీరియల్స్ లో కూడా? నాకుమటుకూ దీంట్లో నరేష్ ఓవరేక్షన్ చేస్తున్నట్టుంది. ఈయనకన్నా హర్షవర్ధనే బాగా చేసాడు. కడివెడు అమృతంలో ఒక విషపుచుక్కపడ్డా, అది ఇదవుతుందన్నట్టు ఇలాంటి కాపీకొట్టుడు సీన్లే ఈ సీరియల్ ని దెబ్బకొడతాయి. పాత అమృతానికి సంబంధించిన వీడియోలు అంతర్జాలంలోకూడ లభిస్తున్నట్టున్నాయి. గూగుల్ కెళ్ళి "Amrutham Gemini Serial" అని టైప్ చేస్తే కావల్సిన లింకులొస్తాయి.Update-30 మే 2008: ఈ సీరియల్ కి సంబందించిన 40 ఎపిసోడ్ ల వీడియోలు తెలుగు కామెడీ క్లబ్ ద్వారా





5 comments:
నేను చూసాను ఆ ఎపిసోడ్. నరేష్ మొదటి ఎపిసోడ్ నుండీ ఓవర్ గా చేస్తున్నాడు. ఇక బీన్ ని కుడా కాపీ చేస్తున్నాడంటే బాగా దిగజారినట్టే!
నాక్కూడా జెమినీలో నచ్చిన ఒకే ఒక ప్రోగ్రాం అది.
--ప్రసాద్
http://blog.charasala.com
నాకు తెలిసినతవరకు నరెష్ గారి నటనలో అనుకరణ లేదు మన అమృతం సీరియల్ నిర్మాణం లోనే బీన్ ను అనుకరిస్తున్నారు..దీనిలో ఏమాత్రం సందేహం లేదు పూర్తి వివరాలకు చదవడి..అమృతం కేరాఫ్ మిస్టర్ బీన్ టపా అమృతం కేరాఫ్ మిస్టర్ బీన్.. www.telugukavitaluvasili.blogspot.com
ఈ సీరియల్ ని హడావిడిగా ఏమీ ముగించలేదు. సుమారుగా 6 సంవత్సరాల నుంచి ప్రసారమవుతుంది. ముందు అమృతం పాత్రలో శివాజీ రాజా నటించారు తర్వాత నరేష్, చివరిగా హర్షవర్ధన్. శివాజీ రాజా, హర్షవర్ధన్ గార్ల యాక్టింగ్ నచ్చంది నాకు. ఆరోగ్యకరమైన హాస్యం. ఇప్పటి సినిమాల్లో వేసే వెకిలి వేషాలకన్నా మెరుగు. పెద్ద గుంపు నటులు లేకున్నా ఒకటి, రెండు పాత్రలతో అయినా సరే నవ్వేంచేది. వేరే ఎవరూ లేకున్నా వెలితిగా అనిపించేది కాదు.
అభిప్రాయాలు చెప్పిన అందరికీ వందనం.
వాణీగారు: Indeed its a good serial. ఆరేళ్ళనుండీ ప్రసారమైందా అంటే దాదాపు 200 పైచిలుకు ఎపిసోడ్ లా. కాదేమో?
ఇప్పుడు మా లో వచ్చేదీ, జెమినీ లో వచ్చిందీ ఒకటేనా. నా అనుమానం ఎవ్వరూ నివృత్తి చేయడం లేదు.
Post a Comment