రాజశేఖర్ ఆఫీస్ పై అగంతకుల దాడి(?)

30 May, 2008

అది నిజమేనా? అయితే ఎంతవరకూ? నిన్న రాత్రి సినిమా యాక్టర్ రాజశేఖర్ ఆఫీస్ పై దాడిచేసి అందులో ఉన్న ఆయన కొత్త సినిమా తాలూకూ పేపర్లని, సి.డీ లని తగులబెట్టారుట. దొంగతనానికి వచ్చిన వారైతే కేవలం డబ్బు దోచుకుని పోతారు కానీ సినిమా స్క్రిప్ట్, సి.డి లను ఎందుకు తగుల బెడతారని జీవితా రాజశేఖర్ లాజిక్కు లాగారు. అంతేగాక కొంతకాలం క్రితం తమపై దాడి చేసిన చిరంజీవి అబిమానులకు దీనితో సంబంధం ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేసారు. నేడు ఇంటిపై దాడి చేసిన వారికి రేపు తమ పిల్లలపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని ఆక్రోశించారు. ఒక తల్లిలా ఆలోచిస్తే ఆవిడ బాధ మను అర్ధమవుతుంది. కానీ అది కన్న తల్లి ఆక్రోశమేనా లేక ఒక రాజకీయ మేధావి ఆలోచనా?

ఈ విషయంలో రాజశేఖర్/జీవిత లు మొదట్నుండీ కూడా పక్కా రాజకీయ నాయకుల్లాగ వ్యవహరిస్తున్నారేమో నన్న అనుమానం నాకుంది. చిరంజీవిపై అవాకులూ చెవాకులూ పేలినందుకు మొన్న కొందరు ఆయన కారుపై దాడి చేసారు. జీవిత మరియు రాజశేఖర్ లు దానినుండి రాజకీయ లబ్ది (పొలిటికల్ అడ్వాంటేజ్) పొందేలోపే దూరదృష్టి కల చిరంజీవి వెంఠనే వెళ్ళి సారీ చెప్పారు. అప్పుడు కూడా జీవిత తన పిల్లల క్షేమం పట్ల అనుమానం వ్యక్తం చేశారు, ఒకసారి గుర్తుతెచ్చుకోండి. నేడు మళ్ళీ అదే కూత. చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతీసారీ రాజశేఖర్ మీదో మరొకరిమీదో దాడిజరగడం, వాళ్ళు పెద్దలొల్లి చేయడం దేనికి చిహ్నం?

మీకొక సినిమా కధని గుర్తు చేద్దామనుకుంటున్నాను. "ఆవిడే శ్యామల" సినిమాలో ప్రకాష్ రాజ్ గుర్తున్నాడుకదా. అతను ఒక ప్రతిపక్ష రాజకీయనాయకుడిని కలిసి అతను అధికారంలోకి రావడానికి సలహాలిస్తుంటాడు. ఒక అమాయకుడైన కార్యకర్త చేత ఆమరణదీక్ష చేయించి, చివరలో ఆదీక్షా శిబిరం మీద మనమే ఒకబాంబుదాడి చేసి, దానిని ప్రభుత్వం మీద నెట్టేస్తే, మనకు సింపతీ ఓట్లు, అధికారం దక్కడం ఖాయం అని చెబుతాడు. ఎవరూ దొరక్క చివరికి ప్రకాష్‍రాజ్ నే దీక్షకి కూర్చో పెడతారు. కానీ ఆ నాయకుడు సింపతీకోసం నిజంగానే తనపై బాంబుదాడి చేసి చంపేయాలని చూస్తున్నారని తెలిసి శిబిరం లోంచి పారిపోతాడు.

జీవిత రాజశేఖర్ గారూ, పైన తధాస్తు దేవతలుంటారంటారు, దయచేసి మీ పిల్లల్ని ఈ రాజకీయ ఊబిలోకి లాగి తద్వారా లబ్ది పొందుదామనుకోవద్దు. ఆధారాలు లేని ఆరోపణలు మంచిదికాదు. ఈ పని ఎవరు చేశారో పోలీసులు , కోర్టులు నిర్ణయిస్తారు. ఇలా అనవసంగా చిరంజీ్విపై అనుమానం వ్యక్తం చేయడం వలన రేపు నిజంగా చిరంజీవిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న 'అధినేతలకు' మీ పిల్లలే ఒక ఆయుధం కావొచ్చేమో! ఆలోచించండి

5 comments:

పుల్లాయన said...

meeru cheppindi bane undi kani indulo inko konam kuda undochu. Chiranjeevi ante gittani vallu evaraina ila daadi chesi chiranjeevi ki prajalalo chedda peru tavalani ila chesi undochu.

Narsingrao said...

well said pullayana

Anonymous said...

మీ అభిప్రాయం చూస్తుంటే అంతర్లీనంగా మీరు చిరు ని సపొర్ట్ చేస్తున్నట్టు వుంధి తప్ప జీవిత గారి బాధ ని అర్ధం చెసుకొనట్టుంది.తల్లి ఎవరైనా పిల్లల గూర్చి అలానే బయపడుతుంధి.దానికి మీరు విపరీత అర్ధాలు తీయడం,తదాస్తు అనడం ఎంతవరకు సమంజసం.ఆలొచించండి.

Chaks said...

అనానిమస్ గారు: నిజంగా చెప్పాలంటే నాకు ఆవిడలో తల్లిపడే బాధ కనబడలేదు. వచ్చిన ప్రతిఅవకాశాన్నీ ఉపయోగించుకోవాలనే తపన, కసి కనబడుతున్నాయి (వాళ్ళమధ్య ఏంగొడవలున్నాయో నాకయిడియా లేదు). నేను "తధాస్తు"అనలేదు, తధాస్తుదేవతలుంటరు జాగ్రత్త అని హెచ్చరించాను, రెంటికీ చాలా తేడావుంది(మరోసారి టపా చదవండి). ఇలాంటి హెచ్చరిక ఇళ్ళలో తరచుగా మన పెద్దలు మనకి చేస్తుంటారు.

Anonymous said...

1. To the people who believe that the first incident (attack on Rajasekhar) is archestrated by somebody else other than Chiru Family/close Friends

If you know the people who involved, or if you know the village (Koduru near Avanigadda Krishna Dist) some of them came from and that villagers (almost all of the village) involvement during riots after Vangaveeti Ranga death, I bet you will come to conclusion otherwise.

2. New Incident:
May be Jeevitha is over-reacting or may be not. You have to be in her shoes and understand her fears.
For me it looks like that she does not have any choice other than joining into some political party at this time. Only time will tell.