యధా రాజా, తధా మంత్రి

29 May, 2008

మొన్న ఎమ్.ఆర్.పి.ఎస్ రౌడీయిజాన్ని చూసింతర్వాత మళ్ళీ ఇదిగో తరువాతి రోజునే అంటే నిన్న రాత్రి టీ.వీల్లో మరియు ఈ రోజు పేపర్ లలో మంత్రి ముఖేశ్ రౌడీయిజాన్ని చూసింతర్వాత ఎలా స్పందించాలో అర్ధంకావడంలేదు. ఒకప్పుడు టి.వీ కెమెరాలకి ఈ నాయకులు భయపడేవారు, గతకొన్నేళ్ళనుండీ దానికీ భయపడడం మానేశారు. డబ్బు పంచడమే ఓ పెద్ద నేరం దానికితోడు రెడ్ హ్యాండెడ్ గా అదికూడా మీడియా చూస్తుండగానే దొరికిపోయాకకూడా ఏమాత్రం జంకుగొంకు లేకుండా రౌడీయిజానికి పాల్పడడం దేన్ని సూచిస్తుంది? రాజాంతర్యాన్నెరిగిన పోలీసులు కూడా తమ శక్తి కొద్దీ ముఖేశ్ సేవ చేసుకున్నారు. ఒక పార్లమెంటేరియన్ అని కూడా చూడకుండా సి.పి.ఎం ఎమ్.పి మధుని ఇష్టానుసారం తిట్టడం, కొట్టడం ఏ సంస్కృతికి నిదర్శనం? అసలిలాంటివాళ్ళ మీద ఎలక్షన్ కమీషన్ కొరడా ఝుళిపించాలి, ఎమ్.ఎల్.ఏ పోస్టు నుంచి డిస్మిస్ చేసి మళ్ళీ ఎలక్షన్ లలో నిలబడకుండా నిషేధించాలి. రాజెలా వుంటే మంత్రులూ అలాగే వుంటారు తద్వారా ప్రజలూ అలాగే మారతారు. వీళ్ళతప్పేం లేదన్నట్టు అప్పుడే ప్రచారాం కూడా మొదలయ్యిందట. కరపత్రం సాక్షిగాడైతే ఓ మెట్టెక్కి విపక్షాలు ముఖేశ్ వియ్యంకుడి ఇంట్లోకి తరువాత బెడ్ రూములోకెళ్ళి విధ్వంసం సృష్టించారని రాశాడు కానీ దాని ఫోటోలు మాత్రం వెయ్యలేదు(అవి తయారవుతున్నాయ్, నెమ్మదిగా వస్తాయిలేండి). ఎలక్షన్ ముందురోజు మంత్రి రౌడీయిజం, ఎన్నికల్లో ఎలా పరిణమిస్తుందో? లోక్ సత్తా సిద్ధాంతాల వ్యతిరేకులూ... మీరేమంటారు?

2 comments:

Naveen Garla said...

ఎం.పీనా గిం.పీనా ... వాడిని కొట్టాలా నరకాలా. లేకపోతే ప్రశాంతంగా ప్రజలకు సొమ్ములు పంచుకొంటూ మా ఎలక్షన్ల బాధలు మేము పడుతూంటే మధ్యలో వచ్చి ధార్నా గీర్నా అని చెప్పి గొడవ పెడతారా? దమ్ముంటే మీరూ ముందు, ముక్క, నోట్లను పోటీ పడి పంచాలే కానీ, మమ్మల్ని వేలెత్తి చూపడం స్పూర్థి అనిపించుకుంటుందా? మీడియానా...గీడియానా...ఏం చూపిచ్చుకుంటుందో చూపిచ్చుకోమను... ఎవడేం పీకుతాడో చూస్తాం. ఐనా పిచ్చోళ్ళారా... గౌవర్నమెంటు మాకు గొడుగులు పడుతూ, ఖాఖీలు మా కాళ్ళుపడుతూంటే మాకెందుకురా భ్యయ్యం. ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటరైపోతావ్ కొడ...

(http://gsnaveen.wordpress.com)

Chaks said...

నవీన్ గారు: పొలిటికల్ భాష తన్నుకొస్తోంది... ఇంతకీ ఈ ఆత్మ ముఖేశ్‍దా లేక కాంగ్రేస్‍దా. రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం మీరన్నట్టే చాలా ఘాటుగా ఉంది.