లోక్‍సత్తాకి ఎన్ని "ఓట్లొ"స్తాయి?

28 May, 2008

ఎన్ని ఓట్లా? ఎన్ని సీట్లు అనబోయి ఎన్ని ఓట్లు అన్నానేమో అనుకుంటున్నారా లేక అచ్చుతప్పేమో అనుకుంటున్నారా? అదేంకాదు, నేనన్నది, మీరు చూసింది రెండూ కరక్టే. సిద్ధాంతాలు, ఆవేశాలు అన్నీ కొంచెంసేపు పక్కనబెట్టి కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. అత్యద్భుతం జరిగితే తప్ప ప్రస్తుతం లోక్‍సత్తాకి సీట్లు గెలిచే కెపాసిటీ లేదన్నదీ అందరూ అంగీకరించే సత్యమే. కానీ లోక్‍సత్తా ఈ తెలంగాణా ఎన్నికల్లో నలుగురు అభ్యర్ధుల్ని నిలబెట్టింది. వాళ్ళుకూడా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలని అనుసరించి ఏదో ప్రచారం లాంటిది చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఈ నలుగురికీ కలిపి ఎన్నిఓట్లు రావొచ్చని మీరనుకుంటున్నారు. పక్కనున్న ఓటుబాక్సులో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. ఓటుతో పాటు బ్లాగ్లోకానికి ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఎలాగూ కామెంటు సెక్షను ఉందికదా.

5 comments:

chandramouli said...

For Frank while,
Telanganalo Loksattaki votlu takkuvagane vastayi....

KCR lekkala prakaram Educated people, and Telangana Development kosam korukune subhiddi kaligina vaaru chala takkuva vunnaru kanuka... lok sattaki votese vaaru maatram vundaru ani....

kanee edanna votlu vaste... hyd city lo vi konni....warangal arealo konni vastayemo bahusa.....

kosta andhra rayalaseemalo ne emmanna vastayemo ... otlu....vaallki.....

sujata said...

లోక్ సత్తా ఒక్క సీట్ కూడా అస్సలు గెలవదంటారా ? కనీసం ఇండిపెండెంట్ అభ్యర్ధుల కన్నా తక్కువ వస్తాయా వేల్లకి సీట్లు ? చదువుకున్న వాళ్లు కూడా వీళ్ళకు ఓట్లు వెయ్యరా ? లోక్ సత్తా ఈ ఎన్నికల్లో కనీసం తన ఉనికిని నిలబెట్టుకోవాలి. ఎప్పుడూ కాంగ్రెస్, తె.దే.పా లేనా అధికారం లో ? జనానికి విసుగు పుట్టదా ? లోక్ సత్తా కు ఒక చాన్స్ ఎందుకు ఇవ్వకూడదు ?

Chaks said...

ఈసారి పోలింగ్ శాతం పడిపోయింది. ఆంధ్రజ్యోతి లెక్క ప్రకారం ఖైరతాబాద్ లో లో.స గెలవకపోయునా గట్టిపోటీ ఇచ్చుండొచ్చని చెప్పింది. కనీసం ఒకసీటొస్తే, ఈ ఒకసంవత్సరం నడవడికనిబట్టి వచ్చే ఎన్నికల్లో కాస్త గుర్తింపుండొచ్చు.

కిరణ్ said...

వారసత్వ రాజకీయాలు మన దురదృష్టం ...భావి భారత ప్రధాని ఒకడు ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టెక్కుతున్నాడు......ఇంకా మరొకడు ప్రియాంక చేతిలో పెరుగుతున్నాడేమో? వ్యక్తిగత చరిష్మా ,కుటుంబ ప్రతిష్ట ..... దాటి వోటు వెయ్యడం మనదగ్గిర ఇంకా రాలేదు .....ఇంకా కుల రాజకీయాలు ,డబ్బు, మందు ,చీరలు, నానా అసహ్యం........తెలీనిదేముంది..........వీటన్నిటినీ దాటి లోక్ సత్తా గెలవగలిగితే అద్భుతమే........
కటారి శ్రీనివాస్ (ఖైరతా బాద్ లోక్ సత్తా అభ్యర్ధి) మంచి వ్యక్తి..సామాజిక స్పృహ ఉండి ,ఏదో చేద్దామన్న తపన ఉన్న వ్యక్తి..........ఆయన మాకు పీజీ లో ఒక సబ్జెక్ట్ చెప్పారు.... మంచి ఉత్సాహం ఉంది ఆయనకు.

అబ్రకదబ్ర said...

రాహులుడికి పెళ్లవుతుందో లేదో చెప్పటం కష్టంగానీ అతను ప్రధాని అవుతాడో లేదో చెప్పటం బహు సులభం :-)