మొత్తానికి కర్ణాటకానికి శుభం కార్డు పడింది. కొద్దిగా అటూఇటూ గా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే బి.జె.పి సాధారణ మెజార్టీతో గెలుపొందింది. భాజపా కి ఇంత బలం రావడానికి సెంటిమెంటు ప్రధాన కారణమేఅయినా దానితోపాటు ఒక అవకాశం ఇచ్చిచూద్దామన్న ప్రజల ఉద్దేశం కూడా ఒక కారణమే. నా ఉద్దేశం ప్రకారం భాజపాకి మరో 5 సీట్లు వచ్చేయే కానీ చాలా చోట్ల కాంగ్రేస్, జేడీఎస్ కుమ్మక్కవడం వలన ఆ వోట్లు మిస్సయింది. జాతీయ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయంవున్న ఈ తరుణం లో కీలకమైన మరో రాష్ట్రం చేజారడంతో కాంగ్రేస్ లో అయోమయం ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఇక మన "సాక్షి" కొన్నాళ్ళ క్రితం చెప్పిన పోల్ ప్రిడిక్షన్ లో కాంగ్రేస్ కి 120 సీట్లు గ్యారంటీ అన్నదాని గురించి మాట్లాడడం అనవసరం.
కాంగ్రేస్ పరిస్థితి ఎలా ఉన్నా మన వై.ఎస్.ఆర్ గారు మాత్రం చాలా ఖుషీ గా ఉండుంటారు. ఎవరైనా సొంత పార్టీ వాళ్ళు గెలవాలనుకుంటారు కానీ పైకి ఎన్ని కబుర్లుచెప్పినా వై.ఎస్.ఆర్ గారు మాత్రం లోపల్లోపల కాంగ్రేస్ ఓడిపోవాలని (బళ్ళారిలో మాత్రం) కోరుకునుంటారు. ఎందుకంటే ఆయన ప్రియ మిత్రులు "గాలి"సోదరులు ఎప్పటిలానే బళ్ళారిలో భాజపా తరపున పోటీ చేస్తున్నారు. సొంతపార్టీవాళ్ళ పోరు తద్వారా సోనియాగారు వెనకాలనుండి పెడుతున్న వాతలకు తట్టుకేలేక ఆయన బళ్ళారివచ్చి కాంగ్రేస్ కి అనుకూలంగా ప్రసంగించారు కానీ చిత్తశుద్ది లేని శివపూజ ఎందుకండి? రాహుల్‍గాంధీ దళితవాడల్లో తిరిగింతర్వాత ’ప్రత్యేక’సబ్బుతో స్నానం చేసినట్టు (మాయ చెప్పిందీ... ఐ విట్నెస్ ఎవరో?) మన వై.ఎస్.ఆర్ గారు ఈ బళ్ళారి మొక్కుబడిమీటింగ్ తర్వాత కాంగ్రేస్ ఓటమికోసం, గాలి సోదరుల గెలుపుకోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయించారని ఇక్కడ జనాలు చెవులుకొరుక్కుంటున్నారు.
కర్ణాటకలో భాజపాయేతర ప్రభుత్వాలున్నప్పుడే గాలి సోదరుల హవా కర్ణాటకలోనే కాక ఆంధ్రప్రదేశ్ అంతటా నడిచింది. ఎంతలా అంటే... ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రిని, ప్రతిపక్షనాయకుడ్ని బండబూతులు తిట్టే కెపాసిటీ అధికారపార్టీనాయకుడి తరువాత ఈయనఒక్కడికే సొంతం. ఇంకా, వచ్చే ఎన్నికల్లో టి.డి.పి ని మట్టికరిపిస్తానని శపధం కూడా చేసాడు. ఇప్పుడు కర్ణాటకలో భాజపా ప్రభుత్వమే ఏర్పడబోతోంది. ఇక ఈ ’గాలి’ తాకిడి కాస్తా తుఫాన్‍లా మారి ఆంధ్రప్రదేశ్ ని ఏంచేస్తుందో?
ఆకాశవాణి హెచ్చరిక: కర్ణాటకలో ఏర్పడిన ఈ అధికపీడనం సాధారణ గాలిని, తుఫానులామార్చి ఆంధ్రప్రదేశ్ విపక్షులమీద విరుచుకుపడబోతోందని ఆకాశవాణి హెచ్చరించింది.

0 comments:
Post a Comment