మార్కెట్ మాయ: ఒక్క రోజులో కోటీశ్వరులుయిన అదృష్ఠవంతులు

23 May, 2008

షేర్ మార్కేట్, ట్రేడింగ్: అంతా మాయ. లాభాలు, నష్టాలు మనతో దోబూచులాడే దొంగాట ఇది. ఒకరు లాభపడాలంటే వేరెవరో నష్టపోవాల్సిందే, వెంఠనే కాకపోతే కొంచెంలేటుగా అయినాసరే, ఇదే స్టాక్ మార్కెట్ లాజిక్కు . నష్థపోయినా తట్టుకునే వాళ్ళే ఇక్కడికి రావాలి. గత రెండేళ్ళనుండీ ట్రేడింగ్ చేస్తున్నాను. ఏదో మరీ లక్షల్లో కాకపోయినా గత రెండేళ్ళమీద చూసుకుంటే స్టాక్ మార్కెట్ నుండి ఒక లక్షదాకా పిండుకున్నానేమో. కానీ ఈ న్యూస్ విన్నదగ్గరనుండి నాలోని షేరాత్మ గోల పేడుతున్నాడు, ఈ భాగ్యం నాకుదక్కలేదని ఒకటే లొల్లి. విషయం ఏంటంటే...

బోంబే స్టాక్ ఎక్సేంజిలో కె.జి.ఎన్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ మొన్న అంటె బుధవారం రీలిస్టయింది. ఈ షేరు ఏవో కారణాలచేత ఏడేళ్ళక్రితం డీలిస్ట్ అయింది అంటే అప్పటినుంది ఈ షేర్ ని మార్కెట్ లో కొనలేం లేదా అమ్మలేము. ఆ కంపెనీ షేర్ లున్న వాళ్ళు పడిన బాధ ఇదిగో మళ్ళీ మొన్నట్రేడ్ మొదలవడంతో పోయింది. వాళ్ళ పరిస్థితి తంతే బూరెల బుట్టలో పడట్టయింది. బుధవారం ఉదయం 72రూపాయల దగ్గర మొదలయిన షేరు ధర 55000 (అక్షరాలా యాభైఐదు వేల) రూపాయలవరకూ వెళ్ళింది. సాధారణంగా ఏదైనా కంపెనీ కొత్తగా ఎక్సేంజి లో లిస్టయినా లేదా రీలిస్టయినా వాటికి ఎక్సేంజి "ఫిల్టర్ని" ఉంచదు. ఫిల్టర్ అంటే ఒక లిమిట్, అంటే ఒక షేర్ ఒకరోజులో అత్యధికంగా/అత్యల్పంగా ఎంత ధర ఉండొచ్చు అని చెప్పేది. ఈ లిమిట్ దాటితే ఇక ఆరోజుకి ఆ షేర్ ని అమ్మడం/కొనడం చేయలేం. ఉదయం ఎవరైనా ఈ కంపెనీ 100 షేర్ లని 72 రూపాయలదగ్గర కొనుక్కున్నా మధ్యాహ్నానికి లేదా తరువాత రోజైనా అమ్ముకుంటే అరకోటీశ్వరుడే.

మరీ ఇంత కాకపోయినా మరో పెన్నీ స్టాకు సిఫ్ టెక్నాలజీస్ ది కూడా ఇలాంటికధే, ఇదికూడా నిన్నే రీలిస్టయింది. ఐదేళ్ళక్రితం డీలిస్ట్ అయినప్పుడు దీని ధర 80 పైసలు. నిన్న రీలిస్ట్ అయినప్పుడు ఒక టైం లో 800 టచ్ అయి చివరికి 200 దగ్గర స్థిరపడింది.

మరికొంత న్యూస్ (ఎన్.డి.టి.వి ద్వారా): కె.జి.ఎన్ ఇండస్ట్రీస్, సిఫ్ టెక్నాలజీస్

నాదగ్గరకూడా ఒకపెన్నీస్టాకు (కలర్ చిప్స్) వుంది ప్రస్తుతం డీలిస్ట్ అయింది. గత ఏడాది నుండి ఇది ట్రేడవట్లేదు. భవిష్యత్తులో ఒకవేళ రీలిస్ట్ అయితే నేనుకూడా ఈలెక్కన అరకోటీశ్వరుడయ్యే చాన్సుందేమో అనుకోవడం అత్యాశ అంటారా?

3 comments:

విహారి said...

ఒక కంపెనీ డీలిస్టు అయిన తరువాత కొత్త పేరుతో రావాలి. వున్న షేరు విలువ సున్నకు రావాలి. అలా కాకుండా మళ్ళీ వస్తే దాని విలువ పెరుగుతుందా. ఇదేదో ఇక్కడి నాస్డాక్ వాళ్ళు ఫాలో అయితే బావుండు. నేను బిలియనీర్ అవచ్చు.

-- విహారి

Chaks said...

అవసరంలేదు విహారిగారు. డిలిస్ట్ కావడనికి చాలా కారణాలు ఉంటాయి. పేరుమార్పుకోసం అయ్యేవాళ్ళు లేదా ఎక్సేంజికి ప్రతీ ఏడాది పంపాల్సిన వివరాలు (ఉదా|| బ్యాలన్స్ షీట్) పంపనివాళ్ళు, ఏదోకారణాలవల్ల ఎక్సేంజి ఫీజు చెల్లించని కంపెనీలు, షేర్ విడగొట్టడానికి వగైరా వలన డీలిస్ట్ అవుతాయి. ఉదా|| రిలయన్స్ డిలిస్ట్ అయింతర్వాత పాతకంపెనీ (RIL) పేరుతోపాటు కొన్ని కొత్త కంపెనీలు (RNRL,REL etc.,) కూడా రీలిస్టయినట్టుగా.
రీలిస్ట్ అయింతరువాత కొత్తకంపెనీల మార్కెట్ వాల్యూతెలుసుకోడానికి ఎక్సేంజివాళ్ళు ఆ ఒక్కరోజూ ఫ్రీ ట్రేడ్ ఎలౌ చేస్తారు అంటే ఫిల్ట్రర్ లుండవు.
ఇండియాలో స్టాక్ మోసాలెక్కువ అందులోనూ పెన్నీస్టాకుల్లో కాబట్టి ఇలా జరగొచ్చు కానీ నాస్డాక్ లో జరిగేచాన్స్ లేదేమో. ఎన్.ఆర్.ఐ లుగా మీరుకూడా ఇండియామార్కెట్ లో మీఅదృష్టం పరీక్షించుకోవచ్చు.

కొత్త పాళీ said...

అభీష్ట సిద్ధిరస్తు