కొన్నిరోజుల క్రితం నేను ’మన మధ్యతరగతి ప్రజలు తెగతింటున్నారు’ అని జార్జిబుష్ గారు చేసిన వ్యాఖ్య మీద బ్లాగాను. ఒకప్పుడు ఆహార ఎగుమతి దారయిన మనదేశం/మనరాష్ట్రం త్వరలోనే దిగుమతిదారవచ్చని చెప్పాను. అసలు ఆహార కొరతకి మనరాష్ట్రం, మన నాయకమణ్యులు ఎంత కారణమో నాకుతెలిసిన కొన్ని వివరాలను వెల్లడించాను. ఒక శాస్త్రీయమైన సర్వే లేకుండా సర్కారు ప్రతిసారీ "ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది" అని అంటుందే కానీ అంతకంటే అధికంగా పెరిగిన జనాభాని లెక్కలోకి తీసుకోదు. అదే విషయంమీద ఈరోజు ఈనాడులో "అన్నపూర్ణవాకిట ఆహారసంక్షోభం" శీర్షికతో వచ్చిన వార్త నాఆలోచనలకి దగ్గరగా ఉండడం యాధృచ్చికం. ఈ విషయం మీద ఈనాడు ధారావాహికంగా కధనాన్ని ప్రసారం చేస్తుందట. నేను మిస్సయిన మరికొన్ని కోణాల్ని కూడా ఈనాడు స్పృశించవచ్చు.కార్టూన్: రవి - ఈనాడు ద్వారా





0 comments:
Post a Comment