చిరంజీవి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వివరాలతో ఒక అనధికారక వెబ్‍సైట్ ప్రారంభమయిందట. ఈరోజు ఈనాడు పేపర్ చూస్తుంటే ఈ న్యూస్ కనబడింది. ఈవెబ్ సైట్ ని అబిమానులైన సాఫ్ట్‍వేర్ నిపుణులు రూపొందించారట. చిరంజీవి పార్టీపెట్టాక ఈ అనధికార వెబ్‍సైట్ ని "చిరంజీవి యువత" అధికారక వెబ్‍సైట్ గా మారుస్తారట. ఇందులో ఎంతవరకూ నిజమున్నా ఈ సైట్ గురించి నాకున్న కొన్ని అభిప్రాయాలు ఇక్కడ... మీతో... లుక్ & ఫీల్: అంత రిచ్ గా లేదు బహుశా భవిష్యత్తులే ఏమైనా మారుతుందేమో? (సాఫ్ట్‍వేర్ ఇంజనీరులు తయారుచేసారంటే గొప్పగా ఊహించుకున్నా)
ఎరుపు బ్యాక్‍గ్రౌండ్: కమ్యూనిస్టులతో పొత్తుకు రెడీ అన్నట్లుంది. వాళ్ళని ఇప్పట్నించే ప్రసన్నం చేసుకోవడానికా?
హిట్ కౌంట్: నేను పేపర్ చదివి ఈ పోస్ట్ మొదలుపెట్టినప్పుడు: 10113, పదే నిముషాల్లో 15500,అంతా ఈనాడు పుణ్యమే అనుకుంటా!
లాగిన్: పనిచెయ్యడంలేదు, రిజిస్టర్ చేసుకున్నాక ఈమెయిల్ కన్ఫర్మేషన్ లేదు, లాగిన్ అయినా "వెల్‍కం గెస్ట్" అనేచూపుతోంది.
భాష: క్షమించాలి తెలుగుకి ఇక్కడ చోటులేదు
కంటెంట్: ఇంకా బాలావస్థలోనే ఉంది, ప్రస్తుతానికి పెద్దగా విషయం లేదు. చిరంజీవి పేరే తప్ప ఫోటోలేని సైట్.
మీటింగ్స్ సెక్షన్: "Venue: Satya Sai Nigamam, Srinagar Colony" దీనికి హైదరాబాద్ అని ఒక పదం తగిలిస్తే బాగుంటుంది. దానితో పాటు ఒక మ్యాప్ లేదా ఆ స్థలానికి చేరుకోవడానికి సూచనలు వుంటే బాగుంటుంది.
వెల్‍విషర్స్: ఈ సైట్ ఓనర్స్ యొక్క వెల్ విషర్స్ నూతన్ కుమార్ మరియు శ్రీనివాసగౌడ్ అట. వారి గురించి మకొంత సమాచారం ఇస్తే బాగుంటుంది. నాకైతే వారెవరో తెలీదు. (ఈనాడు ప్రకారం ఈ సైట్ చిరంజీవి అధికారిక సైట్ అయితే ఈ సెక్షన్ ని మార్చాలి ఎందుకంటే చిరంజీవికైతే దాదాపు యావత్ ఆంధ్రదేశం, యావత్ తెలుగుజాతి వెల్‍విషర్సే [కాపీ రైటెడ్ :) ] అలాగని పెట్టుంటే బాగుండేది.)
లోగో & పంచ్ లైన్: ఈ సైట్ కేవలం ఐ.టి వారికోసమే అన్నట్లున్నాయి. చంద్రబాబు వీటిని నమ్ముకునే బొక్కబోర్లా పడ్డాడు గదా!
సరదాగా: ఈ వెబ్‍సైట్ ని మైక్రోసాఫ్ట్ వారి డాట్‍నెట్ అనే లాంగ్వేజ్ లో రాసినట్టున్నారు, అందుకే ఈ వెబ్‍సైట్ పేరుకూడా do(i)t net అనేలా ఉంది.
Update @22-మే-2008: వెబ్‍సైట్ లాగిన్ పనిచేస్తుంది. వెబ్‍సైట్ హిట్‍కౌంట్ 44275 అంటే ఒక్కరోజులో 30000 హిట్లు చిరంజీవి లెవల్ కి ఇంకా ఎక్కువొస్తాయనుకున్నా. బహుశా ఈ నెలాఖరుకి ఒకలక్ష అవుతుందేమో.





2 comments:
బాగా రాస్తున్నారు. కొనసాగించండి.
ఈ సైటు రివ్యూ ఫీచరు బావుంది. ఇలాగే కొన్ని మీ దృష్టికి వచ్చిన సైట్లని కూడ రివ్యూ చేస్తే బావుంటుంది.
@కొత్త పాళీ గారు: మీ ప్రోత్సాహానికి అలాగే టపాలు మీకు నచ్చినందుకు నా ధన్యవాదాలు. అలాగే, ఏదో సరదాగా ఈ సైట్ గురించి వ్రాశాను. మిమ్మల్ని మెప్పించేలా రాసినందుకు నాకునేనే వేసుకుంటున్నా ’ఓ వీరతాడు’.
Post a Comment