నటనని చూసి ఆవిధంగా మగాళ్ళనికొట్టేవాళ్ళుంటారా అంతా ట్రాష్ అనుకునే ఆడాళ్ళుండొచ్చు, ఆ!! ఆడాళ్ళేంకొట్టగలరు మగాళ్ళని అని సర్దుకునే మగాళ్ళుందొచ్చు గానీ కొన్నిసంఘటనలనిచూస్తే ఎంతమగాడికైనా గడ గడ మని కారాల్సిందే. ఆమధ్య చైనాలో ఒక రాకాసి భార్య అకృత్యానికి చావుతప్పి కన్నులొట్టపోయినట్టయింది ఒక భర్తకి.గత ఐదేళ్ళనుండి మనదేశంలో కూడా భార్యాబాధితుల సంఖ్య పెరుగుతున్నట్లున్నది. వీరిని భార్యాబాధితులనేకన్నా ఆడ-పక్షపాత-చట్టాల బాధితులనడం సబబేమో? వారికి చేయూతగా కొన్ని సంస్థలు మొదలయినాయి ఉదాహరణకి మెన్-సెల్ అలాగే కుటుంబసంక్షేమంకోసం పనిచేసే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ. ఒకప్పుడు ఆడాళ్ళ సమస్యలను అర్ధంచేసుకుని వారిపోరాటంలో మగాళ్ళుసాయపడినట్టుగా ఈ భార్యాబాధిత లేదా ఆడవిధేయచట్టబాధిత సంఘాలకుకూడా కొందరు సహృదయులైన ఆడవారి సాయం లభించడం సంతోషకరమైన వార్త. దానికి ఆధారమే ఈ సంవత్సరం జనవరి నెలలో బెంగళూరులో మరియు ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో జరిగిన భార్యాబాధితుల మహాధర్నా. అందులో భార్యల ప్రతాపానికీ మరియు ఎవరిది తప్పో తెలుసుకోకుండా ఆడాళ్ళనిమాత్రమే వెనకేసుకొచ్చే కొన్ని దగుల్బాజీ సంఘాలకి వ్యతిరేకంగా బాధితులు, చాలామంది ఔత్సాహికులు పాల్గున్నారు. మరియొక ముఖ్యవిశేషం ఈ ధర్నాలో స్వచ్చందంగా కొందరు ఆడాళ్ళుకూడా పాల్గోవడం. ఇప్పటికీ మగాళ్ళపట్ల, వారికున్న కెపాసిటి పట్ల సమాజానికున్న కొన్ని అపోహల వలన లేదా అనవసరంగా వాళ్ళకివాళ్ళే కల్పించుకున్న "మగాడు, వాడికేంటి" లాంటి ఇమేజ్ వలన చాలామంది బాధితులు బయటికి రావడంలేదు. సమసమాజం కోసం పాటుపడుతున్నామనే వాళ్ళు దీనికేసీ ఒకసారి చూడాలని, చట్టాలు ఆడాళ్ళ చుట్టాలుకాకుండా చూడాలనీ ఈ బాధితుల అభ్యర్ధన.
కార్టూన్ ఇమేజ్ సోర్స్: ఈనాడు






11 comments:
మంచి వివరాలు అందించినందుకు సంతోషం. ఈ డొమెస్టిక్ వయలెన్స్ చట్టం మరీ దారుణంగా తయారయింది. ఎన్నో కుటుంబాలు తప్పుడు కేసులతో వీధిన పడుతున్నాయి. పెళ్ళైన స్త్రీ వెళ్ళి రెండు లైన్ల కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇస్తే చాలు. ఎలాంటి విచారణా లేకుండా అరెస్ట్ చేసి పడేయమంటుంది ఈ చట్టం. ఈ కేసుల్లో భర్త, అత్త మామలనే కాకుండా అభంశుభం ఎరుగని ఆడపడుచులు, వారి భర్తలు , పిల్లలను కావాలని ఇరికిస్తూన్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే కేసు బలంగా ఉండటానికి అంటున్నారు. బీహార్ లాంటి వెనుక బడిన ప్రాంతాలలో భార్యలు పడుతున్న కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయి. అలాంటి అభాగ్యుల కోసం ఏర్పరచబడిన ఈ చట్టం మన రాష్ట్రం లో ఎంతో దుర్వినియోగం అవుతూంది. అన్ని రాష్ట్రాలనకన్నా మన రాష్ట్రం లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కుటుంబ వ్యవస్థను విచ్చిన్నం చేస్తున్న ఈ తరహా చట్టాలనుండి నిజంగానే ఇండియన్ ఫామిలీని సేవ్ చేయాలి. లేదంటే భవిష్యత్తులో కాంట్రాక్ట్ మారేజ్ లదే రాజ్యమవుతుంది.
స్త్రీలకు రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.గృహ హింస చట్టం లాంటిది మగవాళ్ళక్కూడా రావాలి.
కానీ నువ్వుశెట్టి గారి కామెంటులో అభం శుభం తెలియని ఆడపడుచులు అన్నారు.అది నేను ఖండిస్తున్నాను.అసలు కుటుంబాలలో గొడవలు ఆడపడుచుల అతి జోక్యం వల్లే వస్తాయి.అది తెలుసుకోగలరు. నిజానికి ఏ పాపం తెలియని ఆడపడుచులకు నా మాటలు వర్తించవు.
నువ్వుశెట్టి బ్రదర్స్ మరియు రాధిక మీ అభిప్రాయాలు చెప్పినందుకు కృతఙ్ఞతలు. మీరు చెప్పింది కొంతవరకూ నిజమే. "ఆడపడుచుల (పెళ్ళయిన/ఇంకాకాని) అతిజోక్యం" గురించి కొంత ఆలోచించేముందు ప్రతీ భార్యా కూడా తనకి ఒక ఆడపడుచు వున్నట్లే తనుకూడా ఒకరికి ఆడపడుచు (పుట్టింట్లో) అని గుర్తుంచుకుంటారా?. పెళ్ళయిన మహిళకు తన పుట్టింట్లో సర్వహక్కులూ పోవాలా? అక్కడేపుట్టిపెరిగిన ఆడపడుచుకి స్వతహాగా కొంత స్వాతంత్ర్యం (హక్కులు) ఉండడం సహజం. అది అందరూ అర్ధంచేసుకుంటే గొడవలేఉండవు. నేను చూసిన సంసారాల్లో కొత్తగా కాపురానికి వచ్చిన భార్యకి, ఆడపడుచుకి ఎవరికి హక్కు ఎక్కువ లేకపోతే ప్రేయారిటీ ఎక్కువ అనే దగ్గరే తేడాలొచ్చాయి. అవికూడా మొదట చాలా చిన్నచిన్న విషయాల దగ్గర, పోనుపోనూ అవే పెద్దవిగా కనబడతాయి.
రాధిక గారితో ఏకీభవిస్తున్నాను! ఆడపడుచులకు పుట్టింట్లో హక్కులుంటే ఉండొచ్చు కానీ, అన్న, లేదా తమ్ముడి కాపురంలో కలగచేసుకునే అధికారాలు ఉండవు! ఇవి చట్టాలు చేసి చెప్పే విషయాలు కావు. కామన్ సెన్స్ తో ఆలోచించాల్సినవి! సదరు ఆడపడుచు కూడా 'నా పెళ్లైన తర్వాత నా ఆడపడుచు ఇలా అన్ని విషయాల్లో కలగజేసుకుంటే నేనెంత discomfort ఫీలవుతాను ' అనే విషయం ఆలోచిస్తే బాగుంటుంది.
రాధిక గారు! నిజానికి ఏ పాపమూ తెలియని ఆడపడుచులకు నా మాటలు వర్తించవు అని మీరే అన్నారు కదా. నేనూ అదే అన్నాను :) అభంశుభం తెలియని అని. కొన్ని కేసులలో వీరిని కేసు బలంగా ఉండటం కోసం ఇరికస్తున్నారు, నేను కేవలం వాటి గురించే ప్రస్థావించాను. అసలు కుటుంబ సమస్యలు తన వల్ల వచ్చే అవకాశం ఉంది అని అనిపించినప్పుడు ఏ పడుచయినా, వ్యక్తి అయినా కాస్త దూరంగా ఉండటమే ఉత్తమం. కాని ప్రాక్టికల్ గా అలా జరగటం లేదు. ఏదేమైనా ఈ చట్టం కుటుంబ వ్యవహారాల్లో కాస్త అతిగానే జోక్యం చేసుకుంది. దీని వల్ల న్యాయం పొందిన వారు ఎంతమంది ఉన్నారో మరి. జై హింద్
నాకుతెలిసినంతవరకూ ఈ విషయంలో న్యాయం అంటే "విడాకులు" లేదా "విడికాపురం" అంతే కదా! ఉమ్మడి కుటుంబాలు భారత సాంప్రదాయం అని గర్వంగా చెప్పుకునే మనదేశానికి అది సమస్యకు పరిష్కారం అవుతుందా? ఆమధ్యన ఒక సినిమా వచ్చింది టైటిలో లేక డైలాగో గుర్తులేదు కానీ అది "సర్దుకుపోదాం...రండి" అనుకుంటా. అది భార్యాభర్తలకు సంబంధించిన సినిమానే అయినా ఆమాట అందరికీ వర్తిస్తుంది. ఇక సర్దుకుపోవడం కుదరదు అనుకున్నప్పుడు జరిగేదేంటో అందరికీ తెలుసు. ఈ రోజుల్లో అందరికీ ఉక్రోషం, కోపం, అతి ఆత్మాభిమానం అన్నీ ముక్కుమీదే వుంటున్నాయి. మాటకిమాట చెప్పకపోతే తరువాత చులకనిపోతామేమో అన్నభయం కూడాకావచ్చు.
శారీరికంగా బలహీనురాలైన ఆడది బలవంతుడైన మగవాణ్ణి కొట్టదనే నమ్మిక వల్ల మగవాళ్ళమీద జరుగుతున్న హింసకు ప్రచారం లభించలేదు. కాని నేను ఇలాంటి కేసులనేకం స్వయంగా చూశాను. అంతమాత్రాన ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళూ కారు. మగవాళ్ళంతా అమాయకులూ కారు.
మనం అర్థం చేసుకోవలసింది. కొట్టగలగడం వేఱు. నిజంగా కొట్టడం వేఱు. ఎదుటివాళ్ళని కొట్టాలంటే కొట్టగలిగే శరీరదార్ఢ్యం ఉంటే సరిపోదు. కొట్టేంత హింసాత్మక ప్రవృత్తి మనిషిలో ఉండాలి. మా బిల్డింగులో ఒకాయన రోజూ భార్య కొట్టే దెబ్బలకు భరించలేక అస్సామ్ కి బదిలీచేయించుకుని పారిపోయాడు కొంతకాలం. బిల్డింగులో ఉన్న పెద్దమనుషులంతా కలిసి రాజీచెయ్యడంతో ఇప్పుడు కలిసే ఉంటున్నారనుకోండి. మా పక్క బిల్డింగులో ఉండే ముసలామె రోజూ మా దగ్గరికొచ్చి "తన చిన్నకొడుకుని కోడలు మాటిమాటికీ కొడుతోం"దని చెప్పుకుని ఏడిచేది.
ఆవేశం, పక్షపాతం ఏమాత్రం లేకుండా విషయాన్ని చక్కగా చేరవేశారు. మంచి టపా. హింస శారీరకమైతే కొంతవరకూ భరించవచ్చు. మానసిక హింసలు మరీ దారుణమైనవి. ఆడైనా మగయినా మనిషికి హింస తీవ్రత ఒక్కటే కదా. తాము పడే హింసను మరొకరితో చెప్పడం మగతనానికి భంగమనే భావన మగాళ్లతోనూ, తామనుభవించిన హింసను పూర్తిగా చెప్పుకోవడం సిగ్గుమాలిన తనమౌతుందేమోననే శంక ఆడవారిలోనూ వుండటమనేది హింసించేవారికి ఉపయోగపడుతూ వుంది. బాధిత వ్యక్తి మగాడయితే సాధారణంగా హేళన, ఆడదయితే సాధారణంగా అతిసానుభూతి. రెండూ భరించరానివే. ఈవు టీజింగు మరియు ఈవులు చేసే టీజింగు రెండూ ఈ బింకాన్ని ఆసరాగా చేసుకొని జరుగుతున్నవేననుకుంటాను.
ఈ టీజింగుల్లో చాలా రకాలు గమనించాను. పెద్ద పుస్తకమే వ్రాయొచ్చు ఈ కళల గురించి. :)
అవును సమస్య ఎవరికయినా ఒకటే...
చట్టం అందరికీ ఒకేలా పని చెయ్యదు మన దేశంలో. నువ్వుశెట్టి గారు చెప్పినట్టు అలాంటి వాటి గురించి నేను కూడా విన్నాను.
మంచి చెయ్యడం కోసం చేసిన చట్టం దుర్వినియోగమవుతుంది ఇలాంటి సందర్భారలో.
మగవాళ్ళు కూడా టీజింగుకి గురవుతారు, వాళ్ళూ బాధితులు కాగలరు.
వున్న చట్టాలను దుర్వినియోగం (abuse) చెయ్యడం లో మన వాళ్ళను మించిన వాళ్ళు లేరేమో. చిన్న విషయాలకే బెదిరించి తాము చెప్పినట్లు ఆడించే భార్యా చుట్టాలు చాలా మంది వున్నారు. మధ్య తరగతి చెందిన అబ్బాయి డబ్బున్న అమ్మాయికి జరిగిన వివాహాల్లో కొంచెం ఎక్కువ.
ఇక్కడ మా ఊళ్ళో కూడా విన్నా. ఓ తెలుగు కుటుంబం లో ఆవిడ బెల్టుచ్చుకుని కొడుతుంతే ఆయన ఆపార్ట్మెంట్ అంతా పరుగులు పెట్టేవాడట.
-- విహారి
మంచి డిస్కషను.
సాహితీ యానం
Post a Comment