"అవినీతి పై ఎన్నికలు జరిగితే కాంగ్రేస్ దే విజయం: బాబు" అనే శీర్షికతో ఈ రోజు ఈనాడు పేపర్లో 15వ పేజీలో వచ్చిన వార్త చూశారా? దీని అర్థం ఏమిటో మీకు అవగతమైందా? చెప్పేవాడికి సరిగా చెప్పడం రాలేదో లేక రాసేవాడికి సరిగా అర్ధంకాలేదో లేక నేనే సరిగా అర్దం చేసుకోలేకపోయానో గానీ ఈ వ్యాఖ్య నాకు మటుకూ వంకర అర్దాన్ని కలుగజేసింది. ఒకవేళ బాబుగారి ఉద్దేశం అవినీతిపై ఎన్నికలు (రిఫరండం) పెడితే కాంగ్రేస్ కే ఎక్కువ మార్కులు (ఓట్లు) పడతాయనా? అలా అయితే దాన్ని కాంగ్రేస్ విజయమంటారా లేక ఓటమంటారా? విజయం అంటే గర్వంతో తలెత్తుకు తిరిగేలా చేసేది, కాంగ్రేస్ కి అవినీతిలో ఎక్కువ మార్కులొస్తే అది విజయగర్వం ఎలా అవుతుంది? ఈ విషయం లో రెండు రకాల ప్రశ్నలు అడగవచ్చు౧) "కాంగ్రేస్ అవినీతి ప్రభుత్వమా? - అవును / కాదు"
౨) "అత్యధిక అవినీతి ప్రభుత్వం - టి.డి.పి/కాంగ్రేస్"
కాంగ్రేస్ గెలుపు, "కాదు" అన్నదానికి ఎక్కువ వోట్లు వస్తే కదా. అంటే దానర్దం అవినీతి ప్రభుత్వం కాదనేగా. బహుశా బాబు ఉద్దేశం రెండవ ప్రశ్నేమో? ఇందులోకూడా ఎక్కడో తంతున్నట్టుంది. మీరేమంటారు?





5 comments:
మీరన్నది నిజమే. నాకు కూడా చాలా తికమకగా వుంది.
kodiguddu mida eekalu peekuthunaremo meeru?
....maku matram chala spashtam ga artham aindi ...
రెఫరండంని ఎన్నికలు అని అనరు, ప్రజాభిప్రాయసేకరణ అని అంటారు. శీర్షికలో ఉన్న "కాంగ్రేస్ దే విజయం" అనే మాట కి "అవినీతిని" కలిపినపుడు ఆ శీర్షిక నన్ను కొంచెం భ్రమపరచింది.
'అవినీతిపై సర్వే జరిపితే' అనుండాల్సింది. ఆవేశంలో తప్పుగా అనేశాడు బాబు. అప్పుడెప్పుడో జార్జ్ బుష్ కూడా ఇలాంటిదే ఏదో తికమకగా అన్నాడని విన్నా, ఏదో గుర్తులేదు.
http://anilroyal.wordpress.com
kodiguddu mida eekalu peekuthunaremo meeru?
....maku matram chala spashtam ga artham aindi ...
maaku kuda chaala clear ga ardhamyindi.
ther is little difference between elections and referendum in this contest
whoever gets more votes ( winner as you want to call ) is the most corrupt
Post a Comment