
మన తెలుగు బిడ్డ వేణుగోపాల్ మళ్ళి ఎయిమ్స్ డైరెక్టర్ గా పదవీబాధ్యతలు చేపట్టారట అదీ సుప్రీంకోర్టు ఆశీర్వాదంతో. అదేంటి! మరి ఈ కధలో విలన్ అన్బుమణి రాందాస్ ని పట్టుకుని ’జిడ్డు’ రాందాస్ అంటున్నాడు ఏంటి వీడు అనుకుంటున్నారా? పూర్తిగా చదవండి సార్. ఈరోజు న్యూస్ పేపర్ లో "తెలుగోడి విజయం" పేరుతో ఈనాడు , "తెలుగుతేజం విజయగీతిక" పేరుతో జ్యోతి, "రాందాస్‍కు పరాభవం" పేరుతో సాక్షి రాసిన వార్తలు చాలా అనందం కలిగించాయి. అయితే అంతగొప్ప తెలుగు వ్యక్తికి మన తెలుగువాళ్ళ తరపున లభించిన సహకారం ఎంత?
మన తెలుగువాడికి అందునా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక్ వైద్య నిపుణుడికి మన తెలుగు ప్రభుత్వంనుండి, ప్రజలనుండి, పార్టీలనుండి లభించిన సహకారం పత్రికలలో ఒకరోజు స్టేట్‍మెంట్లు తప్ప దాదాపు గుండుసున్నా. ఎందుకంటే కేంద్రంలో ఆ చెత్త నిర్ణయం తీసుకున్న మహానుభావులు మన రాష్ట్రాన్నేలే మహానుభావులు ఒకేపార్టీవాళ్ళు కాబట్టి. మీరు బాధపడినా, తిట్టుకున్నా గానీ ఫరవాలేదు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే తమిళులకున్నపాటి ఆత్మగౌరవం కూడా తెలుగువాళ్ళకి లేదు. ఉండుంటే అప్పుడే కనీసం ఒక ధర్నాయో లేకపోతే మరోరకంగానో నిరసన తెలిపుండే వాళ్ళం ఆయనకి మన సంఘీభావం తెలిపేవాళ్ళం. గత నాలుగేళ్ళ లో
మనరాష్ట్రానికి రావల్సిన ఎన్నో కేంద్రప్రభుత్వ సంక్షేమ పధకాలను తమిళనాడు తన్నుకుపోతుంటే ఆ తప్పు గుడ్లప్పగించి చూస్తూనేవున్న మన రాజకీయ నాయకులదా? రాష్ట్ర సంక్షేమం కన్నా పార్టీనే మిన్ననుకునే మన ముఖ్యమంత్రిగారిదా? అన్నీ తెలిసీ మౌనంగా ఉన్న మనలాంటి ప్రజలదా? బహుశా తమిళులకి ఆంధ్రులు ఆరంభశూరులే కాదు చేతగాని వాళ్ళనికూడా అనిపిస్తుందేమో!. గుంటనక్కలా ఎన్నో రకాల ఎత్తులువేసి చివరికి గోపాల్ ని ఘోరంగా అవమానించి ఇంటికిపంపిన రాందాస్ కి ఇప్పుడు అలాంటి అవమానమే మిగిలింది. సిగ్గు ఎగ్గు ఉన్నవాడైతే ఈపాటికి రాజీనామా చేసిఉండేవాడు. అలాచేయలేదు సరికదా పైప తనతప్పేం లేదనీ, ఆయనని వెళ్ళగొట్టడం వెనుక UPA ప్రభుత్వం కూడా వుందని బుకాయిస్తున్నాడు. తన సీటుని వదలనంటున్నాడు. మొన్నామధ్య బాలు అని ఒకమంత్రి గారికూడా ఇలాగే స్వయం సేవయే పరమార్ధమని తలంచి చేసుకున్న పనులు మన్మోహన్ గారికి తలనెప్పి తెచ్చిపెట్టాయి. పాత్రలకంటిన జిడ్డుని వదలగొట్టడం తేలికే గానీ ఈ జిడ్డుని వదిలించుకోవడం ఎలా అని మన్మోహన్ గారు ఇప్పుడు ఆలోచిస్తుండుంటారు.
5 comments:
వేటగాడు మెత్తనైతే లేడి మూడు కాల్లతో పరిగెత్తడమంటే ఇదే.
సిగ్గు, శరం, అభిమానం, ఆత్మాభిమానం, లజ్జ, లేని నా కొడుకులు రాజీనామా ఎలా చేస్తారు??
దుర్మార్గపు రాజకీయాలకి ఇదో చెప్పు దెబ్బ.
దీన్ని తెలుగు - తమిళ యుద్ధంగా చూడాల్సిన అవసరం లేదనుకుంటా. వేణుగోపాల్ కూడా తక్కువేమీ తినలేదు కదా. ఆయన రాజకీయాలు ఆయన నడిపాడు. ఇద్దరూ ఇద్దరే.
శ్రీయుత వేణుగోపాల్ గారు ఆ సంస్థకు అధిపతి ,రామదాసు ఆ మంత్రిత్వశాఖకు అధిపతీ,అలాంటి సందర్భాలలో ఇలాంటి గొడవలు తప్పవు,ఆయనవల్ల తెలుగువారికి ఊడిపడింది ఏమీలేదు ఇదో రాజకీయ క్రీడ అంతే
Post a Comment