అన్నట్లుంది మన తెలుగు సినిమాల్లో కొందరి పరిస్థితి. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిశలు అన్నట్లు పైకి మటుకూ నీతులు చెబుతూ తెర వెనుకమాత్రం విలనీ పనులు చేస్తుంటారనుకుంట. తెలుగు సినిమా రంగానికి సంభందించి గత కొన్నేళ్ళుగా జరుతున్న సంఘటనలు పరిశీలిస్తే ఎవడెప్పుడు విలన్‍గా అవతరిస్తాడో చెప్పడం కష్టంగా ఉంది. చెల్లని చెక్కులిచ్చి అవతలివారిని తమచుట్టూ/కోర్టులచుట్టూ తిప్పించే ఘనులు, తమ అవసరాలకోసం మాఫియా తో చెట్టాపట్టా లేసుకుని అవసరం అయితే అవతలివారినీ లేపెయ్యగ నికృష్టులు, వేన్నీళ్ళకు చన్నీళ్ళ తోడులా ఎక్స్‍ట్రా సంపాదన కోసం కాల్ గర్ల్ గా అవతారమెత్తుతున్న నాయకిలు, చిల్లర డబ్బులకోసం వీసాల రూపంలో దేశాల్నే మోసంచేసే నాయకీమణులు, చివరికి ఇదిగో మొన్ననే తనను అందలం ఎక్కించిన జనాల నెత్తినే "గోల్డ్ క్వెస్ట్" కుచ్చుటోపీ పెట్టాలనుకున్న వారికి మనఃపూర్వకంగా సహకరించిన ఒకప్పటి వెండితెర కధా నాయకుడు ఇప్పటి క్యారెక్టర్ (ఉందంటారా, లేదంటారా?) నటుడు చంద్రమోహన్. ఎవడైనా దొంగ దొంగతనంచేసి దొరికిపోతే ఏమంటాడు? తనకేపాపం తెలియదని, అనవసరంగా ఇరికించారని లేదా శతృవుల కుట్ర అని అంటాడు. ఈయన మటుకూ అలా బుకాయించే రకం కాదండీ, చాలా నిజాయితీ పరుడు అందుకే తనకన్నా పెద్ద దొంగలు సినిమా రంగంలో చాలా మంది ఉన్నారని తాను చేసింది చాలా తక్కువని అన్నారు. పైగా దమ్ముంటే వాళ్ళను పట్టుకోడని సవాలు చేశారట (తెలిస్తే వాళ్ళ పేర్లు చెప్పవచ్చుగా? దేశం బాగుపడేది) . ఇది చూస్తుంటే మన శాసన సభలో అధికార పక్షం ప్రతి పక్షం మీద చెప్పే మాటల్లా లేవూ? మన Y.S.R కూడా ఇలాగే ఫలానా దాంట్లో అవినీతని ఎవరైనా అంటే చాలు, మీ జమానా లో ఇంతకన్నా ఎక్కువే జరిగిందని ఎదురు దాడి చేస్తారు. బహుశా చంద్రమోహన్ కూడా రాజకీయాల్లో చేరదామనుకుంటున్నాడేమో? షరా మామూలు గానే "మా" (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వాళ్ళు వచ్చి "మా " టి.వీ.ముఖంగా ఆయన చెప్పిందాన్ని ఖండించారనుకోండి. అంతే ఎవడైనా దొరికేంత వరకే దొరలు, లేకపోతే ముందే ఒప్పుకుంటారేటీ మీ పిచ్చి గానీ!. పోలీసులు కూడా వాళ్ళ రొటీన్ డైలాగు "నేరస్తులెంతపెద్దవాళ్ళైనా వదిలేది లేదు" ని అప్పగించేశారు. మొన్నటి దొంగ వీసాల కేసులో ఎందరో ప్రముఖ తెలుగు నటులు ఉన్నారని ఎంబసీ వాళ్ళు అన్నారు, ఆ పేర్లని మన పోలీసులకిచ్చారట. దాని అతీ గతీ ఇప్పటిదాకా లేదు, ఇక ఉండకపోవచ్చు కూడా. ఈ గోల్డ్ క్వేస్ట్ కేసు కూడా అంతేనేమో.
Subscribe to:
Post Comments (Atom)





2 comments:
Nice Post !
You should use a Telugu social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.
చంద్ర మోహన్ కి ఏమన్నా మెంటలా?? లేకపోతే gold quest కి సినిమా రంగానికి సంభందం ఏమిటి?? సినిమా రంగంలో తను కూడా ఒక సభ్యుడే కదా. goldquest case ఏమి అవదు. just one page in crime history.
Post a Comment