గూగుల్ త్వరలోనే
తన బ్లాగ్ అనాలసిస్ టూల్ "గూగుల్ అనలటిక్స్" ని బ్లాగర్ తో కలుపుతుందట. ఇప్పటిదాకా అనలటిక్స్ మరియూ బ్లాగర్ రెండూ కూడా గూగుల్ ఉత్పత్తులే అయినప్పటికీ బ్లాగర్ లో ఉన్న మన బ్లాగు స్టాటిస్టిక్స్ కావాలంటే మాత్రం అనలటిక్స్ లో సభ్యత్వం తీసుకొని ఆ కోడ్ ని మన బ్లాగులో ఉంచాలి. అంతేకాక ఆ స్టాటిస్టిక్స్ చూడాలంటే ప్రత్యేకంగా అనలటిక్స్ సైట్ కి వెళ్ళి చూడాలి. కొన్నాళ్ళ క్రితం గూగుల్ మెజర్ మాప్ అనే సైట్ ని కొన్నాది. దానినుపయోగించే ఈ కొత్త ఫీచర్ ని బ్లాగర్ లో ప్రవేశపెట్టాలని యోచన.
గూగుల్ అనలటిక్స్ అనేది అన్ని రకాల బ్లాగ్ ప్లాట్‍ఫార్మ్ లకు పనిచేస్తున్నప్పటికీ మెజర్‍మేప్ నుండి కొన్న సాఫ్ట్ వేర్ ని మాత్రం బ్లాగర్ కోసమే మార్చుతున్నారు. అంటే అనలటిక్స్ లో లేని చాలా ఫీచర్స్ ని దీనిలో ఉంచాలని వారి ప్రయత్నం. ఈ కొత్త ఫీచర్
అనలటిక్స్ కన్నా సరళంగా ఉంటుందని అనలటిక్స్ అధికారిక బ్లాగ్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది ప్రైవేట్ బీటా వెర్షన్ లో ఉంది, పబ్లిక్ బీటా కి రావడానికి ఇంకొన్ని నెలలు పట్టవచ్చు.
అనలటిక్స్ కన్నా సరళంగా ఉంటుందని అనలటిక్స్ అధికారిక బ్లాగ్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది ప్రైవేట్ బీటా వెర్షన్ లో ఉంది, పబ్లిక్ బీటా కి రావడానికి ఇంకొన్ని నెలలు పట్టవచ్చు.




3 comments:
మంచి విషయం తెలియజేశారు. నెనర్లు
On its face, the very concept of an own Website is incresingly made obsolete by Google, when Blogger.com does most of the job.
ఇలాగే Googleవారు ఆడియో బ్లాగింగు, వర్డ్ /పి.డి.ఎఫ్ ఫైళ్ళ నిలువ, Paypal, SWERG లాంటి బాహ్యోపకరణాలు (third-party functionalities) కూడా ప్రవేశపెడితే బావుంటుంది. అప్పుడు వారు ప్రతి బ్లాగరి నుంచి కొంత Charge చేసినా తప్పు లేదు.
maa wordpress bloggers ki eppudosthundo aachance?
జాబిల్లి గారు, వర్డ్ ప్రెస్ లో ఇప్పటికే ఓ మోస్తరు గా ఈ సదుపాయం ఉంది.మీ డష్ బోర్డు లోని బ్లాగ్‍స్టాట్స్ ద్వారా కొన్ని స్టాటిస్టిక్స్ ని చూడవచ్చు. అయితే గూగుల్ అనలటిక్స్ ని వర్డ్ ప్రెస్ లో చూడాలంటే మాత్రం మనం డబ్బు చెల్లించాలి.
సుభ్రహ్మణ్యం గారు, అవుని మీరుచెప్పిన సదుపాయాలన్నీ ఉంటే బాగుంటుంది. పేపాల్ లాంటిదే గూగుల్ కి ఒక సైట్ ఉంది, దాని పేరు గూగుల్ చెకౌట్ (http://checkout.google.com)
Post a Comment