కూతురిపై అత్యాచారం" వార్త ని చూడగానే ఒళ్ళంతా ఒకటే కంపరం, అసహ్యం కలిగాయి. ఇది నిజమా కాదా తెలుసుకుందామని గూగుల్ ఆశ్రయిస్తే, నిజమేనని తెలిసింది. అది ఇచ్చిన కొన్ని లింకులను క్రింద ఇచ్చాను చూడండి. ఆస్ట్రియా దేశంలో ఒక కామాంధుడైన తండ్రి తన 11 సంవత్సరాల కూతురు ని దాదాపు 24 సంవత్సరాలపాటు తన ఇంటి క్రింది రహస్య గదిలో ఉంచి అత్యాచారం చెయ్యడంతో పాటు, ఆమె ద్వారా ఏడుగురు సంతానాన్ని కన్నాడట ఆ ప్రబుద్ధుడు. 24 ఏళ్ళ పాటు ఒక ఇరుకు రహస్య గదిలో ఉండడమంటే మాటలా? ఎంతబాధ పడిందో పాపం. ఈ విషయంలో భారతీయులు ఏమీ తక్కువ తినలేదు లేండి ఎందుకంటే ఈ మధ్య మనదేశంలో కూడా ఇటువంటి సంఘటనలను జరుగుతున్నాయని ఆమధ్య పేపర్ లో చూశాను. ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మనం తిరిగి ఆటవిక యుగం వైపు వెళుతున్నామేమో అనిపిస్తుంది. ఈ విషయం గురించి మరిన్ని వివరాలకు నేటి (29/4/2008) ఈనాడు పేపర్ చూడండి. మరిన్ని లింకులు క్రింద ఇవ్వబడ్డాయి.సందర్భం వచ్చింది కాబట్టి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. మంచైనా, చెడైనా చిన్నతనంలో నేర్చుకున్నది లేదా అనుభవించినది ఎప్పటికీ మర్చిపోలేము. అది చెడు అయితే జీవితమంతా నరకమే. "స్పర్శ" అనేది పెద్దలకీ పిల్లలకీ
మధ్యన ఒక వారధిలా పనిచేస్తుంది, ప్రేమని పెంచుతుంది. మనం కరచాలనం చేసేది కూడా అందుకే. ప్రతిఒక్కరూ కూడా, వాళ్ళు తల్లితండ్రులైనా, బంధువులైనా, స్నేహితులైనా లేదా అపరిచితులైనా కూడా ఆ "స్పర్శ" ద్వారానే పిల్లలని ప్రేమిస్తారు. అయితే అది ఆత్మీయతని పంచే స్పర్శా లేక దురుద్దేశంతో కూడుకున్న స్పర్శ (చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ (C.S.A)) అనేది ఆ వయసు పిల్లలకి తెలిసే అవకాశంలేదు. తెలియచెప్పాల్సింది పెద్దలే ఎందుకంటే ఒక వయస్సువరకూ మన పిల్లల భవిష్యత్తు మనచేతుల్లోనే ఉంటుంది. C.S.A కి సంభందించిన మరిన్ని వివరాలకు సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనే ఈ లింక్ చూడండి.





6 comments:
అత్యాచారం - అసహ్యం
బంధించడం - పరమాసహ్యం
మఱీ అంతకాలంపాటు ? = ఆ అమ్మాయికి ఇప్పుడు మనఃస్థిమితం ఉందా ? లేదా ? (ఏదేమైనా వాడికి మాత్రం మనఃస్థిమితం లేదు)
ఆ పిల్ల ద్వారా తనకు పుట్టిన పిల్లలనైనా వాడు బయటికి రానిచ్చాడా ? లేక మూసేశాడా ?
మానవ స్వభావం మనుషుల్లో క్రమంగా ఎలా మాయమై పోతోందో చూడండి! ఒక నెల్రోజుల క్రితం ఒక వార్త చదివాను. అరవై ఏళ్ళ తండ్రి, ముప్ఫై ఏళ్ళ కూతురు కలిసి కాపరం చేసి పిల్లల్ని కని ఫొటోలకు పోజులిచ్చారు పళ్ళికిలిస్తూ! వాళ్ళు చెప్తున్నదేమిటొ తెలుసా...ఆ కూతురు చిన్నదిగా ఉన్నప్పుడే భార్యా భర్తలు విడిపోయారట...తిరిగి ఇన్నేళ్ళ తర్వాత కలిసాక, వారిద్దరి మధ్య (వారి బంధం ఏమిటో తెలిసి కూడా) స్త్రీ పురుష సంబంధ మైన ఆకర్షణే కలిగింది గాని తండ్రీ కూతుళ్ళ మధ్య ఉండే అనురాగం కాదట. అసహ్యానికి పరాకాష్ట అంటే అప్పుడే తెల్సింది.
వీడు 24 ఏళ్ళుగా కూతురుపై అత్యాచారం చేస్తున్నాడంటే, ఆ పిల్ల బతికున్న శవమై ఉంటుంది, మతి లేకుండా! ఇలాంటి వాళ్ళకి ఇహ విచారణ, కేసు, పాడు ఇవేవీ లేకుండా ఒకటే శిక్ష విధించాలి.బాబిట్!
వాళ్ళకి పుట్టిన పిల్లలలో పెద్ద సంతానం వయసు 19 సంవత్సరాలట. పాపం పుట్టినతరువాత 19 ఏళ్ళు ఆ చీకటి జీవితాని అలవాటుపడిపోయింది ఒక బిడ్డ.
మీరు నేను ఇచ్చిన లింకులలోకి వెళ్ళి చూడండి, ఆ ఇల్లు తరువాత చాలా చిన్నగా ఉన్న ఆ రహస్య గది యొక్క బొమ్మలున్నాయి వాటిల్లో. బాధపడవలసిన విషయంఏమిటంటే ఎంతో గొప్ప సంస్కృతి సంప్రదాయాలున్నాయని చెప్పుకుంటున్న మన దేశం కూడా ఈ విషయం లో ఏమాత్రం తగ్గకపోవడం.
బాధతోనో,కోపంతోనో,ఎందుకో తెలియదు వణుకొస్తుంది.ఇలాంటి వెధవలకి ఏ శిక్ష వేస్తే సరిపోతుంది?
How come a 11 year girl is beeing sexually assualted from 24 years??
This might have started when she was at 11 years old, now she might be around 35 years old.
Post a Comment