ఈనాడు ని దెబ్బకొట్టడమే మా లక్ష్యం - అందుకు మీరే "సాక్షి": జగన్ తన పత్రిక ప్రకటనలలో ఈ విధంగా చెప్పినా లేదా ఆ పత్రిక కాప్షన్ గా "జగతి (పబ్లికేషన్స్) యే సత్యం" అని మార్చుకున్నా అది వాస్తవికతకి అద్దంపట్టినట్టు ఉండేది.
సాక్షి మీద టపా వ్రాసి చాన్నాళ్ళయింది. వ్రాయడానికి టైమ్ లేకా కాదు, విషయం లేకా కాదు గానీ ఎందుకో కొన్నాళ్ళు ఆ విషయానికి దూరంగా వుందామని అనుకొన్నాను. నిన్న సాక్షి లో ఏదినిజం పేరిట "కధనం కోసం చంపేశారు" పేరిట వ్రాసిన వార్త ని చదివాను. సాక్షి లో పాతసంచికల లింకులో నిన్నటి పేపర్ ని మరోసారి చూద్దామంటే అది చూపించడంలేదు, పక్కనున్న బొమ్మ లో అది చూపిస్తున్న మెస్సేజ్ ని చూడండి. ఈ విషయం మీద పేపర్ క్లిప్పింగ్ విశాఖతీరాన వ్రాసిన బ్లాగ్ లోఉంది చూడండి. నిజంచెప్పద్దూ, ఆ వార్త ను చూసిన తరువాత నేను కూడా ఈనాడునే అనుమానించాను. Y.S.R ని ఇరుకున పెట్టడానికే ఈనాడు వాళ్ళు కొంచెం అతిగా వ్రాసారేమో అనుకున్నాను. కానీ ఈరోజు ఈనాడు దినపత్రిక లో "ఈ జీవచ్చవాలే సాక్షి", "బురద జల్లడమే నిజం" పేరుతో నిన్నటి సాక్షి వార్త కి ఇచ్చిన జవాబు బాగుంది, ఆంగ్లంలో అయితే "టిట్ ఫర్ టాట్" అంటారు. అంతే కాకుండా ఇదే విషయం మీద ఈ-టీవీ2 లో ప్రోగ్రామ్ కూడా ప్రసారం చేస్తున్నారట. పేపర్ లేటుగా చూడడం వలన ఆ ప్రోగ్రామ్ ని నేను చూడలేక పోయాను. ఈ టీ.వీ. ప్రోగ్రామ్ ని జగన్ ఎలా ఎదుర్కొంటాడో? ఇప్పటికే "సాక్షి" టి.వి. పెట్టే ఆలోచనలో ఉన్నాడేమో? ఇకనుండీ ఏదినిజం పేరుతో సాక్షిలో వస్తున్న వార్తలను ఖండించడానికి ఈనాడు లో కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారట. ప్రచారం చెయ్యగా చెయ్యగా అబద్ధం కూడా నిజం అవుతుందని ఈపని చేసిఉండవచ్చు గానీ చివరకి వాడు వ్రాసినదాన్ని ఖండించడానికి వీడు, వీడు వ్రాసిన దానిని ఖండించడానికి వాడు ప్రత్యేక ఎడిషన్ లే పెడతారేమో? జగన్ స్ట్రాటజీ చూస్తుంటే ఈనాడు మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నట్టుంది. ఇతను పేపర్ పెట్టడం ఏంటో గానీ రోజుకి రెండు మూడు పేపర్ లను చదివి విషయం తెలుసుకోవాలనే నాలాంటి వాళ్ళ కి ఈ వార్తలను చదివితే పిచ్చెక్కడం ఖాయం. చివరకి ఏదినిజం అంటే, ఏదీకాదు అంతా మన భ్రాంతి అని అంటామేమో!

4 comments:
ఏముంది బ్రదర్!
అంతా బూడిదేగా చివరకు మిగిలేది!
Enjoy cheddaam guroo ee fourth estate yuddhaanni! Antaku minchi manam em cheyagalam.
హ్హహ్హహ్హ..యెవరని నమ్ముదాము అంటారు?? దొందు దొందే బ్రదర్.. కాని నేను మాత్రము ఒకటి నమ్ముతాను, పది మంది కలిసి ఒక "బర్రె" ని "గొర్రె" గా ఎలా మార్చొచ్హో ఇన్నాళ్ళు "ఈనాడు" వాడు చేసి చూపించాడు.. ఇప్పుడు దాన్ని "సాక్షి" వాడు ఒక కొత్త ఒరవడి తో ముందుకు తీసుకు పోతున్నాడు..కాకపోతే వచ్హిన చిక్కు ఏమిటి అంటే, మన "సాక్షి" ఎంతైనా రాయలసీమ బిడ్డ కదా, కాస్త దుడుకు ఎక్కువ.. అందుకే ఈ బర్రె ల ని గొర్ర లు చేసే పనుల్లొ , ఈనాడు వాడినే మించి పోతున్నాడు, పోయాడు కూడా.. రామోజిరావు కి కూడా అదే బయము పట్టుకుంది.. ఈ రోజు ఈనాడు కథనము చూస్తే అలానే అనిపించింది.. కాని ఒక్క విషయము ఏమిటి అంటే.. కేవలము తెలుగు దేశము పుట్టి 26 సం’లు, అదే ఈనాడు పుట్టి 34 సం"లు.. యెవరు ముందు అంటారు?? రామోజి రావు టి.డి.పి కి చేసిన దాని కన్నా, తన వ్యాపారము,ఆస్తులు పెంచుకోవడానికే ఎక్కువ చేసుకున్నాడు..కాబట్టి వాడికి టి.డి.పి కాకపోతే, ఇంకో గన్నాయ్ గాడు.. యెటొచ్హి చివరకి ఇక్కడ దెబ్బ పడేది సాక్షి కే, వీళ్ళు కేవలము YSR కర పత్రికల లా లేక, "ఈనాడు కక్షి" గా మిగిలి పోవాలిసిందే.. ప్రాంతీయ పార్టిల కి పత్రికలు వుండొచ్హు, ఎందుకంటే ఆ పార్టీ ల కి వాళ్ళే సుప్రిమో లు కాబట్టీ, వాళ్ళ ఇష్టం వచ్హ్హినట్లు ఆడతారు.. అదే ఒక నేషనల్ పార్టీ కి ఒక పాంతియ పత్రిక, అదీ ఒక వ్యక్తి కోసము ఏ మాత్రము సరో అలోచించండి?? ఎలా అంటే.. కాంగ్రేస్ లో కుమ్ములాటలు అందరకి తెలిసినవే (మీకు కూడా), అలాంటప్పుడు , YSR గారి ఆటలు ఇంకెన్నాళ్ళు సాగుతాయో చెప్పలేము.. రేపు YSR కో సొంత పార్టిలో అపోజిషన్ వస్తే.. ఈ పత్రిక యెవరి గురించి రాయాలి?? దాని ప్రత్యమ్నాయము ఏమిటి?? YSR లేని రోజు, సాక్షి ఇంకా కాంగ్రేస్ కొమ్ము కాస్తదంటారా?? హ్హహ్హహ్హ... ఈనాడు వాడు, అప్పుడే చిరు గాలి కి సంకేతాలు కూడా ఇస్తున్నాడు..
స్థూలం గా నే చెప్పొచ్హేదేమిటంటే.. ఇలాంటి వార్తలని మనము ఎప్పుడు ఒక కంటి తో చూడకూడదు అనుకుంటా.. ఎందుకంటే, మనకి "బర్రె" నే చూపిస్తున్నారో, లేక "గొర్రె" నో చూపిస్తున్నారో, పుట్టించిన ఆ దేవుడి కి కూడా తెలియదు, వార్తలు కత్తిరించే "కత్తి వీరుడు-కాంతారావు" కి తప్పించి.. యేమంటారు???
రామ్ గారు చెప్పినట్టు సాక్షి కేవలం Y.S.R పత్రిక (కనీసం "రాష్ట్ర కాంగ్రేస్" పత్రిక కూడా కాదు). Y.S.R కుటుంబం రాజకీయాలలో ఉన్నంతవరకూ సాక్షి ఆ కుటుంబ పత్రిక గానే ఉంటుంది. జగన్ పేపర్ పెట్టింది కేవలం రామోజీరావ్ ని దెబ్బకొట్టడానికే. YSR కి రామోజీరావ్ అంటే ఎంతకక్షో నిన్నటి సాక్షి పేపర్లో 4 వ పేజీ లోని రామోజీ కార్టూన్ ని చూసి చెప్పవచ్చు. మీరు చెప్పినట్టు రామోజి లాంటి వ్యాపారవేత్తకి బాబు కాకపోతే ఒక జె.పి, ఒక చిరు లేక మరొకరు. ఎంతగొప్ప లోడర్ కైనా కావలసింది ప్రచారమే అది పత్రికల ద్వారా మాత్రమే ప్రజలను చేరుతుంది. నెటిజన్ చెప్పినట్ట్లు చివరికి మిగిలేది బూడిదే అయితే అది అమాయక ప్రజలది కానంతవరకూ సంతోషం.
Post a Comment