సాక్షి - నిజమైన సాక్షా లేక దొంగ సాక్షా?

24 March, 2008

సాక్షి తెలుగు దిన పత్రిక ఎట్టకేలకు మొదలయ్యింది. మా’ టివి లో ప్రారంభోత్సవ కార్యక్రమం ని చూసాను. మాట్లాడిన వారంతా, సాక్షి మీద / జగన్ మోహన్ రెడ్డి గారి మీద చాలా నమ్మకంగా ఉన్నారనిపించింది. పత్రిక మొదలు కాకముందే 15 లక్షల మంది చందాదారులుగా చేరారని అనధికార వార్త. అదే సమయం లో ఈనాడు కి 10 లక్షలు మరియు అంధ్రజ్యోతి కి 5 లక్షల మంది చందాదారులట! మొన్నీమధ్యనే మొదలైన సూర్య పత్రిక 1 లక్ష దగ్గర చతికిల పడిందట. ఈ సూర్య పత్రిక వెబ్ సైట్ కోసం Google లో చాలా వెతికాను. ఒక లింక్ (సూర్య తెలుగు డైలీ) దొరికింది కానీ ఇది నిజమైన లింక్ అవునో కాదో ఇంకా తెలియదు. సాక్షి పత్రిక అంతా రంగుల పేజీలే కాబట్టి అందరికీ ఆకర్షణ గానే వుండవచ్చు, మొదటి సంవత్సరం కాబట్టి కొద్దిగా నైనా తటస్తం గా వుండవచ్చు (నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదు!). గత 4 ఏళ్ళ పరిపాలనను బట్టి, నా వుద్దేశం ప్రకారం వీరికి అధికారం చేతిలో వుంది కాబట్టి చందాదారుల సంఖ్య పెంచుకోవడం పెద్ద సమస్య కాదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చందాదారులను పెంచుకోవాలంటే దానికి చాలా మర్గాలున్నాయి. ఇకముందు మీ సాక్షి చందా నంబరు (బహుశా కాంగ్రేస్ లేదా ఈ ప్రభుత్వం వున్నంత వరకు) చాలా ముఖ్యం కావచ్చు, ఉదాహరణకి, మీ గ్యాస్ రీఫిల్ కి, ఇందిరమ్మ గృహానికి, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ లకు మొదలైనవాటికి (ష్!!! అంతా అనధికారికంగానే...). Any way, best of luck Mr. Jagan and letz hope for good. ఏదేమైనా మా’ టివి లో C.P.I నారాయణ గారు చెప్పినట్టు ఈ "సాక్షి" పత్రిక కోర్టు ల దగ్గర దొరికే దొంగ సాక్షుల లాగ దొంగ సాక్ష్యం చెప్పదని ఆశిద్దాం.
Update: Updated with Sakshi website address సాక్షి

5 comments:

koresh said...

jagan tv chaannel pettina bavundedi, avesam entha pani chesthundo paapam, edante adi uhinchukuntaaru, prajalu chaala telivaina vaalu, udyogulaithe inka aviniithiki eduru chepthe daggarundi mari odinchesthaaru, paapam chandra baabu nu chusaina telusukoka povadam ....

gunturmirchi said...

జనం అంత పిచ్చి వాళ్ళు కాదు లెండి. ఎన్ని రంగుల పేజీలు పెట్టినా, ఎంత హడావుడి చేసినా, 'విషయం' లేక పోతే, మొహమాటం లేకుండా, తిరస్కరిస్తారు. ఇహ చందాదారులంటారా, పార్టీ కార్యకర్తలందరూ కలిసి పదిహేను లక్షలేం ఖర్మ, కోటి మందన్నా అవుతారు. మన ఈటీవీ సుమన్ గారు రాసి, సంగీత దర్శకత్వం కూడా వహించి విడుదల చేసే పాటల కాసెట్లు, సీ డీలు పాపం, ఈనాడు, వాళ్ళ ఇతర శాఖల ఉద్యోగులందరికీ బలవంతంగా అంటగట్టేస్తారని పాత్రికేయ మిత్రుడొకరు ఇదివరలో , నేను వార్తలో పనిచేసేటపుడు వాపోయారు. ఇదీ అంతే!

వీళ్ళు ఎంత నిష్పక్ష పాతంగా వార్తలు రాస్తున్నామని చెప్పుకున్నా, జనం దాన్ని పార్టీ పత్రిక గానే చూస్తారు చూస్తుండండి. ఒకవేళ కాంగ్రెస్ చేసిన మంచి పని గురించి రాయాలన్నా, ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది.ఛూద్దాం, ఇదెన్నాళ్ళు నడుస్తుందో! కొస మెరుపేమిటంటే, చంద్ర బాబు కూడా మరో పత్రిక పెడుతున్నాట్ట.

సుమన్, ఉయ్యూరు said...

తమిళనాడు లో జయలలిత పట్టినట్టుగా జగన్ కూడా టి.వి. ఛానల్ పెట్టినా పెట్టొచ్చు. 24 గంటలూ YSR భజన చేసినా చెయ్యొచ్చు. చంద్రబాబు పేపర్ పెట్టడం కొత్త విషయం, ఆయనకి పూర్తి support కాకపోయినా ఆల్రడీ basic support గా జ్యోతి & ఈనాడు వున్నాయ్ కదా? బహుశా భజన చేయడానికి సొంత పత్రిక కావాలేమో!

Anonymous said...

saakshi paper is good, jagan has done a good job. eenadu mariyuandhrajyothi lu chandrababu naidu tottulu.

GCCTELUGUGENIOUS said...

సూర్య తెలుగు దిన పత్రిక ఇంటెర్నెట్ లో చదవండి www.suryaa.com