ఈ రోజు "ఈనాడు" పేపర్ లో నేను సంతోషించదగిన వార్త ఏదైనా వుందీ అంటే అది ఇదే. దాదాపు 5 లేక 6 నెలల క్రితం ఎప్పుడో జయప్రకాష్ నారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించినట్టు news papers లో వచ్చింది. Jayaprakash narayan గురించి దాదాపు 6 లేక 7 సంవత్సరాలనుంచి వింటున్నాను, అంటే ఆయన I.A.S officer పదవి కి వీడ్కోలు చెప్పి లోక్ సత్తా (loksatta) అనే సామాజిక సేవా సంస్ఠని మొదలుపెట్టిందగ్గరనుంచి. చాలాసార్లు అనుకున్నాను ఆయన లాంటి వారు రాజకీయాలలో వుండాలని. అనుకున్నట్టుగానే ఆ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ సిద్ధాంతాలూ బాగున్నాయి. ఆర్భాటాలు లేవు, చెవులు చిల్లులు పడే శబ్దాలు లేవు, లారీ లలో జనాలని తరలించడం లాంటివి అసలే లేవు. Everything is like in a profissional way, in a decent way. కానీ ఆ ప్రారంభోత్సవం తరువాత, ఆ పార్టీ గురించి news papers లో ఏ వార్తా లేదు. నిజం చెప్పొద్దూ, నాకు మటుకు నాకు చాలా doubt వచ్చింది. రాష్ట్రం లో సవా లక్ష సమస్యలు వుండగా, అస్సలు ప్రతిస్పందించకపోతే, జనాలకి ఆ పార్టీ ఉద్దేశం ఎలా తెలుస్తుంది? Over గా ప్రతిస్పందించడం,రాజకీయం చేయడం ఎంత తప్పో అస్సలు ప్రతిస్పందించకపోవడం కూడా అంతే తప్పు. చాలారోజుల తరువాత ఈరోజు ఆపార్టీ గురించి news వింటున్నాను. చాలా సంతోషం. ఈమిటింగ్ లో ఆయన చెప్పిన కథ కూడా చాలా బాగుంది, నేటి రాజకీయ నాయకులకు బాగా సరిపోతుంది. ఇంతకీ ఈ కథని అర్థం చేసుకుని ఎవరికి వోటు వెయ్యాలో నిర్ణయించుకునే శక్తి మన సగటు వోటర్ కి వుందా అనేదే అసలు అనుమానం. ఏదేమైనా I wish you all the best to Jayaprakash Narayan మరియు మన ఆంధ్ర ప్రజలకు.
Note: రాజకీయాలు బురద గుంటల్లాంటి వని చాలామంది అన్నారు. ముఖలో పుట్టి పుబ్బలో మాడిపోయే లా ఈ పార్టీ సిద్ధాంతాలు వుండవని ఆశిద్దాం.
నిశ్శబ్ద కెరటం - లోక్ సత్తా (LokSatta)
23 April, 2007
Subscribe to:
Post Comments (Atom)





0 comments:
Post a Comment