గతవారం రోజులుగా కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ కలిగించిన పద్మప్రియ ఉదంతం చివరికి ఆమె ఆత్మహత్యతో ముగిసింది. పద్మప్రియ కర్నాటక లోని అధికార బి.జె.పి పార్టీ ఉడిపి ఎమ్.ఎల్.ఏ రఘుపతిభట్ భార్య. మొన్నటి ఎలక్షన్లలో ఇద్దరూ కలిసే ప్రచారం చేశారు. ఈ నెల 11వ తేదీన పద్మ ముల్కీ లోని తన పుట్టింటికి వెళుతున్నానని తనకారులో తానే డ్రైవ్ చేస్తూ బయలుదేరింది. కానీ అటు పుట్టింటికీ చేరలేదు ఇటు భర్త ఇంటికీ చేరలేదు. 13వ తారీఖున కుంజార్‍గిరి కొండలదగ్గర ఆమె కారు కనిపించింది. కార్లోని దృశ్యాన్ని బట్టి ఆమె కిడ్నాపయి ఉండవచ్చని భావించారు. 15వ తారీఖున వారి కుటుంబ మిత్రుడు ద్వారా ఆమె ఢిల్లీలో ఉన్నట్లు
తెలుసుకుని అక్కడికి వెళ్ళిన వారికి పద్మప్రియ మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ కనపడింది. ఈ మొత్తం వ్యవహారంలో వీరి కుటుంబ మిత్రుడు అతుల్ ప్రమేయం అనుమానాస్పదంగా కనబడుతుంది. అతను పద్మతో పాటు ఢిల్లీ వెళ్ళి ఒక ప్లాట్ ని అద్దెకి తీసుకోవడంలో సహకరించాడు. మళ్ళీ ఉడిపి వచ్చి ఆమెభర్త రఘుపతి తో కలిసి ఆమెని వెతుకుతున్నట్లుగా నటించాడు. అతను చెప్పిన ప్రకారం ఆమె జూన్ 17వ తారీఖున ఉడిపి వచ్చేద్దామని అనుకుందట. అలా అనుకుంటే అక్కడ ప్లాట్ ని అద్దెకి తీసుకోవడమెందుకో అర్ధంకాదు. ఈ గొడవంతా టి.వీ ల్లో వచ్చేటప్పడికి కొంచెం భయపడి ఆత్మహత్య చేసుకుందని అనుకుంటున్నారు. భర్త పైన కూడ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంలో కొన్ని ప్రశ్నలు1) అతుల్ చెప్పినట్టు రఘుపతి, పద్మప్రియ మధ్య ఏమైనా గొడవలున్నాయా
2) ఎన్నికల తరువాత పరస్పర అంగీకారం ద్వారా విడాకులు తీసుకుందామని నిర్ణయించుకుంటే, ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరమేంటి?
3) ఆమె కారుని ఎవరో ఎటాక్ చేసినట్లుగా సీన్ క్రియేట్ చేసిందెందుకు?
4) అతుల్ తో పాటుగా ఢిల్లీ ఎందుకెళ్ళింది?
5) సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ ఎందుకు చేశారు?
6) ఒకవేళ తిరిగి వచ్చే ఉద్దేశ్యమే ఉంటే ఢిల్లీనుండైనా ఎందుకు ఫోన్ చెయ్యలేదు?
7) ఆమెని ఎవరైనా తప్పుదారి పట్టించారా లేక ఆమె అనాలోచిత నిర్ణయమా?
8) చివరికి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది?
ఇందులో విలన్ అతులా, రఘుపతా లేక ఆమె ఖర్మా? నిజం ఎప్పటికైనా తెలిసేనా?
మరిన్ని వివరాలకు డైజీవర్ల్డ్ వెబ్ సైట్ ని క్రింది లింకులద్వారా చూడండి.1
2
3
4
5
6








